జగన్ సహకరిస్తారు: డిగ్గీ, రాగానే పార్లమెంటులో: షిండే
న్యూఢిల్లీ: శాసనసభలో తెలంగాణ ముసాయిదా బిల్లుపై చర్చకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ సహకరిస్తారని కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్ ఆశాభావం వ్యక్తం చేశారు. జగన్ యువకుడని, శాసనసభ పనితీరును జగన్ అర్థం చేసుకుంటాని భావిస్తున్నానని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో అన్నారు.

ముసాయిదా బిల్లుపై శాసనసభలో ఓటింగు ఉండదని తాను ఎప్పుడూ అనలేదని ఆయన స్పష్టం చేశారు. కావాలనుకుంటే రికార్డులు చూసుకోవచ్చునని ఆయన అన్నారు. ఈ విషయంపై తాను ఆంధ్రప్రదేశ్ శాసనసభకు వచ్చి వివరణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని అన్నారు. శాసనసభలో సీమాంధ్ర సమస్యలను చెప్పవచ్చునని ఆయన అన్నారు.
తెలంగాణ ముసాయిదా బిల్లుకు సీమాంధ్ర సభ్యులు సవరణలు సూచించవచ్చునని, సభ నడవకుండా చూడడం వల్ల ప్రయోజనం ఉండదని ఆయన అన్నారు. తెలంగాణ ముసాయిదా బిల్లుపై చర్చ జరుగుతున్నందున ఆంధ్రప్రదేశ్ లోకసభ, శాసనసభ ఎన్నికలకు పార్టీ అభ్యర్థులను ఖరారు చేయడంలో జాప్యం జరుగుతుందని ఆయన అన్నారు.
తనకు సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇస్తే శాసనసభకు వచ్చి వివరణ ఇస్తానని దిగ్విజయ్ సింగ్ అన్నారు. వచ్చే ఎన్నికలకు పార్టీ అభ్యర్థులను కాంగ్రెసు స్క్రీనింగ్ కమిటీయే ఎంపిక చేస్తుందని ఆయన చెప్పారు. తెలంగాణ సమస్య పరిష్కారం అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లోకసభ, శాసనసభ అభ్యర్థుల ఎంపిక జరుగుతుందని ఆయన చెప్పారు.
రాష్ట్రపతి నుంచి రాగానే తెలంగాణ ముసాయిదా బిల్లును పార్లమెంటులో ప్రవేశపెడుతామని కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే చెప్పారు. బిల్లుపై చర్చించి వెనక్కి పంపించడానికి రాష్ట్రపతి రాష్ట్ర శాసనసభకు ఈ నెల 23వ తేదీ వరకు గడువు ఇచ్చినట్లు ఆయన మీడియా సమావేశంలో చెప్పారు. మావోయిస్టు నేత ఊసెండి లొంగుబాటును స్వాగతిస్తున్నట్లు ఆయన తెలిపారు. లొంగిపోయిన నక్సలైట్లకు పునరావాసం కల్పిస్తామని ఆయన చెప్పారు.
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications