త్వరలోనే కూతురు పెళ్లి: సిమి ఉగ్రవాదుల చేతిలో మృతి
భోపాల్: మధ్యప్రదేశ్‌లోని భోపాల్ సెంట్రల్ జైలులో సిమి ఉగ్రవాదుల చేతిలో ఆదివారం అర్థరాత్రి ప్రాణాలు కోల్పోయారు హెడ్‌కానిస్టేబుల్ రామశంకర్ యాదవ్. కాగా, ఆయన తన కూతురు పెళ్లి కొద్ది రోజుల్లోనే చేయాల్సి ఉండగా.. ఈ ఘటన జరగడం ఆ కుటుంబంలో తీరని శోకం మిగిల్చింది.
డిసెంబర్ 9న తన 24 ఏళ్ల కుమార్తె సోనియాకు.. మేనల్లుడు విజయ్ శంకర్‌తో వివాహం నిశ్చయించారు. పెళ్లి వేడుకల హడావుడిలో ఉన్న కుటుంబ సభ్యులు.. రామశంకర్ హత్యకు గురయ్యాడని తెలీడంతో అంతా దిగ్భ్రాంతికి గురయ్యారు.

యాదవ్ కుమారులు శంభునాథ్, ప్రభునాథ్‌లు ఆర్మీలో పనిచేస్తున్నారు. యాదవ్ మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించి మర్చూరీలో భద్రపరిచారు. బుధవారం రామశంకర్ యాదవ్ స్వగ్రామంలో అతని అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
ఆదివారం అర్ధరాత్రి జైలు నుంచి పరారైన 8మంది ఉగ్రవాదులను పోలీసులు భోపాల్ శివారులో ఎదురుకాల్పుల్లో మట్టుబ్టిన విషయం తెలిసిందే. కాగా, కానిస్టేబుల్ రామశంకర్ యాదవ్ కుటుంబాన్ని ఆదుకుంటామని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఆయన కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వనున్నట్లు రాష్ట్ర మంత్రి ఒకరు చెప్పారు.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications