తండ్రి దారిలో ఆశారాం బాపు కుమారుడు.. అత్యాచారం కేసులో దోషి

సూరత్ : దైవాంశ సంభూతిడిగా తనకు తాను అభివర్ణించుకునే ఆశారాం బాపు అత్యాచారం కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. తాజాగా ఆయన కుమారుడు నారాయణ్ సాయి కూడా రేప్ కేసులో దోషిగా తేలాడు. దీనికి సంబంధించి సూరత్ కోర్టు శుక్రవారం తీర్పు వెలువరించింది. ఈ నెల 30వ తేదీన శిక్ష ఖరారు చేయనుంది. 2013 లో అతడిపై అత్యాచారం కేసు నమోదుకావడంతో పోలీసులు అరెస్ట్ చేశారు.

సూరత్‌కు చెందిన ఓ మహిళ నారాయణ్ సాయిపై రేప్ కేసు ఫైల్ చేశారు. 2002 నుంచి 2005 వరకు మూడు సంవత్సరాలు తాము ఆశ్రమంలో ఉన్నప్పుడు తండ్రీకొడుకులిద్దరు అత్యాచారం చేశారనేది ప్రధాన ఆరోపణ. 2013లో తన అక్కతో కలిసి పోలీసులను ఆశ్రయించిన సదరు మహిళ.. నారాయణ్ సాయి తనపై పలుమార్లు అత్యాచారం చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నారు.

 Jailed Asarams Son Narayan Sai Convicted For Rape

ఆశ్రమం పేరిట ఆశారాం బాపు అరాచకాలు చేశాడనే వాదనలున్నాయి. మైనర్ బాలికలను కూడా రేప్ చేసినట్లు ఆరోపణలున్నాయి. పైగా అత్యాచారం చేయడం పాపం కాదని చెబుతుండేవాడట. చివరకు ఓ రేప్ కేసులో దోషిగా తేలడంతో ప్రస్తుతం జైలుశిక్ష అనుభవిస్తున్నాడు. తండ్రి బాటలోనే ఇప్పుడు తనయుడు కూడా అత్యాచారం కేసులో దోషిగా తేలాడు. ఈ నెల 30న కోర్టు శిక్ష ఖరారు చేయనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+