Viral video: ఆస్పత్రిలో సిగరెట్ తాగిన ఎమ్మెల్యే..
ప్రజాప్రతినిధి అంటే తనని నమ్ముకున్న ప్రజలకు సేవ చేయాలి. ఎల్లప్పుడూ వారికి అందుబాటులో ఉండాలి. మంచి ప్రవర్తన, నడవడికతో భావితరాలకు ఆదర్శంగా ఉండాలి. కానీ ప్రస్తుత కాలంలో కొందరు ఎమ్మెల్యేలు, ఎంపీలు వికృత చేష్టలు చేస్తున్నారు. మహిళలు, యువతులపై అత్యాచారాలకు పాల్పడడం, బహిరంగ ప్రదేశాల్లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడడం చేస్తున్నారు. నమ్మి ఓటేసిన ప్రజల ముందే ఇలా నిస్సుగ్గుగా ప్రవర్తిస్తున్నారు.
అయితే తాజాగా బిహార్ కు చెందిన జేడీ(యూ) ఎమ్మెల్యే అనంత్ సింగ్ ఓ ఆస్పత్రిలో అందరిముందూ సిగరెట్ తాగడం సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పాట్నాలోని ఇందిరాగాంధీ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(IGIMS) లో వైద్య పరీక్షలకు హాజరైన ఎమ్మెల్యే అనంత్ సింగ్ అక్కడ అందరిముందూ సిగరెట్ తాగారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఈ సంఘటనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇక గతేడాది బిహార్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జేడీ(యూ) ఎమ్మెల్యే అనంత్ సింగ్ మొకామా నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. అయితే ప్రశాంత్ కిశోర్ మద్దతుదారు దులార్ చంద్ యాదవ్ హత్య కేసులో అనంత్ సింగ్ అరెస్టయ్యారు. అయితే తాజాగా వైద్య పరీక్షల కోసం పాట్నాలోని ఇందిరాగాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఐజీఐఎంఎస్) కు వెళ్లినప్పుడు అక్కడ బహిరంగంగానే ఎమ్మెల్యే అనంత్ సింగ్ సిగరెట్ తాగారు. అప్పుడు ఆయన చుట్టూ అనుచరులు, సిబ్బంది ఉన్నారు. అయితే ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో పాటుగా ఎమ్మెల్యే అనంత్ సింగ్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి.
"नायक नहीं खलनायक है तू..."
— Priyanka Bharti (@priyanka2bharti) January 18, 2026
सुशासन को धुएं में उड़ाता हुआ अनंत सिंह!
नीतीश जी का दुलारा खलनायक अस्पताल में सिगरेट पीते हुए रीलबाजी कर रहे है!
pic.twitter.com/wQrpEVhAZY
ఈ ఘటన సర్వత్రా చర్చనీయాంశం కావడంతో ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఆర్జేడీ అధికార ప్రతినిధి ప్రియాంక భారతి తన సామాజిక మాధ్యమ ఖాతాలో పోస్టు చేశారు. బిహార్ సీఎం నితీశ్ కుమార్ కు అత్యంత సన్నిహితుడైన అనంత్ సింగ్ సిగరెట్ పొగతో బీహార్ లో సుపరిపాలనను తీసుకొస్తున్నారని ఆమె తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇక ఎమ్మెల్యే అనంత్ సింగ్ ప్రజా సంస్థల రూల్స్ కు విరుద్ధంగా వ్యవహరించారని ఈ ఘటనపై డిబేట్స్ నడుస్తున్నాయి. జైలు శిక్ష అనుభవించిన ఓ రాజకీయ నేత ఆస్పత్రిలో ఇలా చేయడం ఏంటని మాట్లాడుకుంటున్నారు.












Click it and Unblock the Notifications