16 ఏళ్ల అమ్మాయిపై గ్యాంగ్ రేప్, సిగరెట్లతో వాతలు
జైపూర్‌లో దారుణం జరిగింది. ఓ పదహారేళ్ల అమ్మాయిపై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితుల్లో ఒకతను ఆమెకు సిగరెట్ వాతలు పెట్టాడు.
జైపూర్: ఓ పదహారేళ్ల అమ్మాయిపై సామూహిక అత్యాచారం జరిగింది. పని మనిషి అయిన ఆ అమ్మాయిపై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు సోమవారంనాడు చెప్పారు. బాధితురాలు పశ్చిమ బెంగాల్‌కు చెందిన అమ్మాయి.
ఆదివారంనాడు తనపై జరిగిన అత్యాచారంపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుల్లో ఒకరిని బిల్లుగా గుర్తించినట్లు స్టేషన్ హౌస్ ఆఫీసర్ ముఖేష్ చౌదరి చెప్పారు. కొద్ది రోజుల క్రితం నిందితుడు తనపై అత్యాచారం చేసినట్లు బాధితురాలు చెప్పింది.

తనపై అత్యాచారాన్ని ప్రతిఘటించడంతో సిగరెట్‌తో కాల్చినట్లు బాధితురాలు చెప్పింది. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications