జాబ్ ఎర: కదులుతున్న కారులో యువతిపై రేప్

గాంధీనగర్ పోలీసు స్టేషన్‌లో యువతి ఫిర్యాదు చేసింది. నిందితుడిని ఇంకా గుర్తించాల్సి ఉంది. ఆల్వార్‌కు చెందిన ఆ యువతి తరుచుగా ఉద్యోగం కోసం ఆ వ్యక్తితో ఫోన్‌లో మాట్లాడింది. పలుమార్లు ఫోన్లో మాట్లాడిన తర్వాత తనను బిర్లా ఆలయంలో కలవాలని ఆ వ్యక్తి యువతికి సూచించాడు.
ఆలయం వెలుపల ఉన్న కారు నెంబర్‌ను బాధితురాలు చెప్పినట్లు పోలీసులు తెలిపారు. కారులో ఎక్కిన తర్వాత తనను ఆదర్శ నగర్, రాజా పార్కుల వైపు తీసుకుని వెళ్లి తనపై బలవంతంగా అతను అత్యాచారం చేశాడని ఆ యువతి ఆరోపించింది.
జరిగిన సంఘటనతో ఆ యువతి తీవ్రంగా షాక్ తింది. నెమ్మదిగా జరిగిన సంఘటన వివరాలను నెమరేసుకుంటోంది. అతను ఫోన్‌లోనే ఎక్కువగా మాట్లాడాడని, అతని పేరు కూడా గుర్తు లేదని యువతి చెప్పింది. యువతితో మాట్లాడిన ఫోన్ నెంబర్ తీసుకున్నామని, దాని ఆధారంగా నిందితుడిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నామని పోలీసులు చెప్పారు.
ఫోన్‌లో యువతిని నమ్మించి, మోసం చేశాడని పోలీసులు భావిస్తున్నారు. యువతిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి పంపించారు. గురువారంనాడు బాధితురాలి వాంగ్మూలాన్ని నమోదు చేస్తున్నారు. తనను గంట పాటు కారులోనే బందీ చేసి, విండోలు లాక్ చేసి తనపై అత్యాచారం చేశాడని యువతి ఆరోపించింది. త్వరలోనే నిందితుడి అరెస్టు చేస్తామని పోలీసులు అంటున్నారు.












Click it and Unblock the Notifications