ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు.. ప్రేక్షకుల మాదిరి చూస్తూ ఊరుకోం: జైశంకర్ షాకింగ్ కామెంట్స్
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల మధ్య యుద్ధాలు, ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. ఇరాన్- అమెరికా మధ్య యుద్ధం కారణంగా పశ్చిమాసియా రణరంగంగా మారింది. ప్రపంచ వాణిజ్యానికి కీలకమైన హార్మూజ్ జలసంధిపై ఆంక్షలు నెలకున్నాయి. అటు రష్యా- ఉక్రెయిన్ మధ్య నాలుగేళ్లకు పైగా యుద్ధం జరుగుతూనే ఉంది. ఇక భారత్ - పాకిస్థాన్ మధ్య యుద్ధ వాతావరణం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు సౌదీ అరేబియాపై ఇటీవల హౌతీ దళాల దాడులు తీవ్రతరం అయ్యాయి. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో భారత విదేశాంగ మంత్రి ఎస్ జై శంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న యుద్ధాలు, ఘర్షణలకు చర్చలు, దౌత్య విధానమే మార్గమని పిలుపునిచ్చారు.
యూఎన్ డే సందర్భంగా చిన్మయ అమృత్ మహోత్సవ్ గ్లోబల్ సమ్మేళన్ లో భాగంగా జై శంకర్ మాట్లాడుతూ ప్రస్తుతం పశ్చిమాసియా, ఉక్రెయిన్ యుద్ధాలపై కీలక కామెంట్స్ చేశారు. "ఈరోజు దేశంలో రెండు అతిపెద్ద యుద్ధాలు జరుగుతున్నాయి. ఉక్రెయిన్ అలాగే పశ్చిమాసియాలో యుద్ధం. ఈ యుద్ధాల కారణంగా సమాజాలు, ఆర్థిక వ్యవస్థలు అలాగే ఈ ఘర్షణలకు ఎక్కడో దూరంగా ఉన్న ప్రజలపైనా ధరలు పెరుగుదలతో ఈ యుద్ధ ప్రభావం పడుతోంది. ఈ ఘర్షణల కారణంగా నిజమైన మూల్యాన్ని చెల్లించుకుంటుంది వాళ్లే. మనం ఈ ఘర్షణల్లో ప్రేక్షకుల మాదిరిగా ఉండకూడదు. ఈ ఘర్షణలు కేవలం దౌత్యం, చర్చల ద్వారానే ముగుస్తాయని భారత్ భావిస్తోంది. ఈ మేరకు శాంతి కోసం ఆ దేశాలకు సహకారం అందించేందుకు భారత్ తమ వంతు కృషి చేసేందుకు సిద్ధంగా ఉంది" అని జై శంకర్ స్పష్టం చేశారు.

అలాగే టెర్రరిజం పైనా జై శంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ శాంతికి నిజమైన విఘాతం ఉగ్రవాదం అని పేర్కొన్నారు. ఉగ్రవాదాన్ని ఎప్పటికీ ఆమోదించేది లేదని స్పష్టం చేశారు. ఉగ్రవాదాన్ని ఎప్పటికప్పుడు కూల్చివేసేందుకు ప్రపంచ దేశాలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఇక గతేడాది జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ లో పాకిస్థాన్ కు చెందిన ఉగ్రమూకలు దాడులకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ ఉగ్రదాడిలో 26 మంది టూరిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత పాకిస్థాన్ పై భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది.












Click it and Unblock the Notifications
