పాకిస్థాన్ ఓ యూనిక్ దేశం.. ఉగ్రవాదాన్ని అలా కూడా వాడుతోంది: జై శంకర్ సంచలనం

పాకిస్థాన్ పై భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. భారత్ పై దాడులకు ఉగ్రవాదాన్ని నిరంతరం ఉపయోగిస్తున్న ఏకైక దేశం పాకిస్థాన్ అని స్పష్టం చేశారు. ఇతర దేశాలేవీ ఇంత సుదీర్ఘంగా ఉగ్రవాదాన్ని ఉపయోగించవని ఆయన పేర్కొన్నారు. ఇలా అవసరమైనప్పుడల్లా ఉగ్రవాదాన్ని ఉసిగొల్పి పొరుగు దేశాలపై ఒత్తిడి తీసుకురావడంలో పాకిస్థాన్ ఆరితేరిందని ఇలాంటివి హీనమైన చర్యలుగా అభివర్ణించారు. ఎకనామిక్ టైమ్స్ వరల్డ్ లీడర్స్ ఫోరమ్ లో జై శంకర్ ఈ వ్యాఖ్యలు చేశారు.

" నేను మీకు ఏమి చెప్పదలచుకున్నాను అంటే.. ఏదైనా రిలేషన్ బాగుండాలంటే ఇరువైపులా అందుకు ఆసక్తి ఉండాలి. ఇరు దేశాలు ఒకరికోసం ఒకరు పనిచేయాలి" అని జై శంకర్ స్పష్టం చేశారు. భారత్ లో ఉన్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాను తమకు అప్పగించాలన్న ధాకా డిమాండ్ ను తోసిపుచ్చుతూ జై శంకర్ ఈ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు బంగ్లాదేశ్ ప్రధాని తారిఖ్ రహమాన్ మరికొన్ని వారాల్లో భారత్ లో పర్యటించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో జై శంకర్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇక ఇప్పటికే బంగ్లాదేశ్ ప్రధానిని భారత్ కు ఆహ్వానించారు విదేశాంగ మంత్రి జైశంకర్. న్యూదిల్లీలో జరగనున్న బ్రిక్స్ సమావేశానికి హాజరుకావాలని అలాగే భారత్- బంగ్లాదేశ్ మధ్య ద్వైపాక్షిక సమావేశానికి కూడా హాజరు కావాలని అన్నారు.

ఇక ఆగస్టు 5 న బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనా.. దిల్లీలో వర్చువల్ గా మీడియా ఇంటరాక్షన్ నిర్వహించారు. అప్పటినుంచి భారత్- బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు పక్కకు మళ్లినట్లు స్పష్టం అవుతోంది. ఆ తర్వాత షేక్ హసీనాను అప్పగించాలని ఢాకా పలుమార్లు భారత్ ను డిమాండ్ చేసింది. బంగ్లాదేశ్ ప్రధాని రహమాన్ భారత్ పర్యటనను దానికి ముడి పెట్టింది. అయితే షేక్ హసీనా వ్యాఖ్యలపై భారత్ తటస్థ వైఖరిని ఆవలంభించింది. హసీనా కామెంట్స్ కు దిల్లీకి ఎలాంటి సంబంధం లేదని పేర్కొంది.

Jaishankar on pakistan stating onlycountry that consistently uses terrorism to attack against India

ఇక పాకిస్థాన్- అమెరికా సంబంధాలపైనా జై శంకర్ మాట్లాడారు. ఇరు దేశాల మధ్య సంబంధాలకు చాలా చరిత్ర ఉందన్నారు. అయితే అమెరికాతో భారత్ కు ఉన్నది ప్రత్యేకమైన సంబంధం అని జై శంకర్ స్పష్టం చేశారు. ఇక పాకిస్థాన్ ఓ యూనిక్ దేశం అని.. ఈ రోజుల్లో కూడా టెర్రరిజంను క్రమ పద్దతిలో వాడుతూ అవతలి దేశాలపై ఒత్తిడి తీసుకొస్తోందని అన్నారు. ఈ మేరకు ఉగ్రవాదంపై పాకిస్థాన్ వైఖరిని అంతర్జాతీయ మీడియా ముందు ఎండగట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+