కేరళ నన్ రేప్ కేసు: మాజీ బిషప్ ఫ్రాంకో ములక్కల్‌కు బెయిల్ మంజూరు
కేరళ నన్ పై అత్యాచారం చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న జలంధర్ మాజీ బిషప్ ఫ్రాంకో ములక్కల్‌కు ఎట్టకేలకు బెయిల్ లభించింది. కేరళ హై కోర్టు షరతులతో కూడిన బెయిల్ ఆయనకు మంజూరు చేసింది. నిందితుడు ములక్కల్ తన పాస్‌పోర్టును కోర్టుకు సరెండర్ చేయాలని హైకోర్ట్ జడ్జి జస్టిస్ రాజా విజయరాఘవన్ ఆదేశించారు. అంతేకాదు కేరళ రాష్ట్రంలో కూడా అడుగుపెట్టేందుకు వీలు లేదంటూ పేర్కొన్నారు. ఒక్క విచారణ సమయంలోనే ఆయన కేరళ రాష్ట్రంలో అడుగు పెట్టాలని అంతవరకు దూరంగా ఉండాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. కేసుకు సంబంధించి చార్జ్ షీట్ దాఖలు అయ్యేంత వరకు ఈ షరతులు వర్తిస్తాయని కోర్టు వెల్లడించింది.
ఇదిలా ఉంటే అక్టోబర్ 3న బెయిల్‌పై జరిగిన వాదనల్లో హైకోర్టు బెయిల్ మంజూరుకు నిరాకరించింది. ములక్కల్ పలుకుబడి ఉన్న వ్యక్తి అని తను సాక్షులను ప్రభావితం చేసే అవకాశమున్నందున అతనికి బెయిల్ మంజూరు చేయరాదని ప్రాసిక్యూషన్ వాదించింది. దీంతో బెయిల్ మంజూరుకు హైకోర్టు నాడు తిరస్కరించింది. ప్రస్తుతం 54 ఏళ్ల ఫ్రాంకో ములక్కల్ కేరళలోని కొట్టాయం జిల్లాలో ఉన్న పాలా సబ్‌జైల్‌లు ఉన్నాడు. ఇదిలా ఉంటే ఆ సమయంలో విచారణ జరుగుతున్నందున బెయిల్ ఇవ్వరాదంటూ పోలీసులు కోర్టును కోరారు.

జూన్‌లో తనపై అత్యాచారం చేశాడంటూ కొట్టాయం పోలీసులకు కేరళ నన్ ఫిర్యాదు చేసింది. మే 2014లో కురవిలన్‌గద్‌లోని ఓ గెస్ట్ హౌజ్‌లో తనపై అత్యాచారం చేశాడంటూ ఆమె ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత కూడా పలుమార్లు లైంగిక వేధింపులకు గురిచేశాడని చెప్పింది. చర్చి అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా వారు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఫిర్యాదు చేయాల్సి వచ్చిందని ఆమె చెప్పింది. అయితే తనకు ఏమీ తెలియదని లేనిపోని నిందలు తనపై వేస్తున్నారని మాజీ బిషప్ ఫ్రాంకో ములక్కల్ చెప్పారు.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications