దమ్ముంటే: ట్రంప్, పేటాకు కమల్ హాసన్ చాలెంజ్, మేం చేస్తాం !

చెన్నై/న్యూఢిల్లీ: తమిళనాడు సాంప్రాదాయం తెలియకుండా ఇక్కడ ప్రఖ్యాతిగాంచిన జల్లికట్టును నిషేధించడానికి ప్రయత్నించడం కాదని, మీకు దమ్ముంటే డోనాల్డ్ ట్రంప్ నేతృత్వంలో అమెరికాలో జరిగే రోడియో బుల్ రైడింగ్ (ఎద్దు స్వారీ)ని నిషేధించాలని ప్రముఖ నటుడు కమల్ హాసన్ పేటా సంస్థకు చాలెంజ్ చేశారు.

పేటా సంస్థ కేవలం భారతదేశంలోనే జంతుహక్కుల కోసం పోరాటం చేస్తున్నదని, ప్రపంచంలో మరెక్కడా జంతువులు లేవా ? వాటి హక్కుల కోసం పోరాటం చెయ్యడం మీ బాధ్యత కాదా ? అని కమల్ హాసన్ పేటా సంస్థను ప్రశ్నించారు.

కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలకు పేటా సంస్థ భారత సీఈవో పూర్వా జోషిపుర స్పందించారు. 1980 నుంచి పేటా సంస్థ జంతుహింసను అరికట్టడానికి పోరాటం చేస్తోందని గుర్తు చేశారు. యునైటెడ్ స్టేట్స్ (యూఎస్)లో కూడా జంతుహింసను అరికట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నామని స్పష్టం చేశారు.

Jallikattu:PETA takes the bull by thehorns, tells Kamal Haasan they’re fighting rodeos in the US too

యునైటెడ్ కింగ్డమ్ (యూకే), నెదర్లాండ్స్ లో ఇప్పటికే బుల్ రైడ్స్ నిషేధించడానికి పని చేశామని, యూరప్ దేశాల్లో స్పెయిన్ మద్దతుదారులు చేస్తున్న బుల్ రైడ్స్ చట్టవ్యతిరేకం అంటూ అక్కడ కూడా తాము పోరాటం చేస్తున్నామని పేటా సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది.

జల్లికట్టు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ పోరాటం చేస్తున్న యువతకు మద్దతు తెలుపుతూ మంగళవారం కమల్ హాసన్ దమ్ముంటే డోనాల్డ్ ట్రంప్ నేతృత్వంలో యూఎస్ లో రోడియో బుల్ రైడింగ్ ను నిషేధించాలని పేటా సంస్థకు సూచిస్తూ సవాలు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+