జేమ్స్ బాండ్ హాట్ కిస్‌లు: సగానికి కత్తిరింపు

ముంబై : జేమ్స్ బాండ్ ముద్దుల జోరుకు భారత సెన్సార్ బోర్డు కత్తెర్లు వేసింది. ముద్దు దృశ్యాలు మరీ మితిమీరి ఉన్నాయంటూ వాటిని కత్తిరించేసింది. జేమ్స్ బాండ్ స్పెక్టర్ జోరుకు బ్రేకులు వేసింది. ఆ సినిమాలో 007 హాట్ సీన్లకు సీబీఎఫ్‌సీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. డానియల్ క్రేగ్ నటించిన బాండ్ సినిమా స్పెక్టర్‌లో ఉన్న కిస్సింగ్ దృశ్యాలను సగానికి సగం తగ్గించేసింది.

జేమ్స్ బాండ్ సీక్వెల్ స్పెక్టర్ గురువారం ఇండియాలో విడుదలవుతోంది. ఆ మూవీలో హీరో డానియల్ క్రేగ్, హీరోయిన్ మోనికా బెలుస్కీ మధ్య హాట్ కిస్సింగ్ సీన్లున్నాయి. ముద్దు సీన్లలో వారిద్దరు తెగ రెచ్చిపోయి నటించేశారు. గాఢంగా చుంబన దృశ్యాలు అతి సుదీర్ఘంగా ఉన్నాయంటూ సెన్సార్ బోర్డు అభిప్రాయపడింది. అందుకే ఆ సీన్లను 50 శాతానికి తగ్గించినట్లు బోర్డు పేర్కొంది.

James Bond has only half a licence to kiss

51 ఏళ్ల బెలుస్కీ స్పెక్టర్‌లో హాట్ సన్నివేశాలను బాగా పండించింది. ఇటలీకి చెందిన ఈ హాలీవుడ్ భామ ఈ సినిమాలో మాఫియా డాన్ భార్యగా నటించింది. ఓ బెడ్ రూమ్ సీన్‌లో ఇద్దరూ ముద్దుల్లో తేలిపోతారు. అయితే అది రెగ్యులర్ లిప్ లాక్‌లా లేదని, ఆ సన్నివేశంలో చాలా గాఢంగా తమ ప్రేమను వ్యక్తపరిచారని అంటున్నారు. వాటిని సెన్సార్ బోర్డు తొలగించింది..

చుంబన దృశ్యాలనే కాకుండా కొన్ని డైలాగ్‌లను కూడా కట్ చేశారు. అక్కడక్కడ బాండ్ భాష సరిగా లేదంటూ సెన్సార్ బోర్డు అభిప్రాయపడింది. స్పెక్టర్‌లో నాటు డైలాగులున్న సీన్లను కూడా తొలిగించినట్లు బోర్డు సభ్యుడొకరు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+