ఎన్డీఏ- ఇండియా నువ్వా నేనా: డైలీహంట్‌లో లైవ్ కవరేజ్
Jammu Kashmir Assembly election 2024: కేంద్ర పాలిత ప్రాంతం జమ్మూ కాశ్మీర్‌లో దశాబ్దకాలం తరువాత అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ విజయవంతంగా పూర్తయింది. మొత్తం మూడు దశల్లో ఈ ఎన్నికలను సజావుగా నిర్వహించగలిగింది కేంద్ర ఎన్నికల సంఘం. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకవడం హైలైట్‌గా చెప్పుకోవచ్చు.
సెప్టెంబర్ 18, 25వ తేదీల్లో రెండు విడతల్లో పోలింగ్ ముగిసింది. ఈ నెల 1వ తేదీన చివరిదైన తుది విడత ఓటింగ్ పూర్తయింది. జమ్మూ కాశ్మీర్‌లో ఉన్న మొత్తం అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య.. 90. తొలి విడతలో 24, మలిదశలో 26 పోలింగ్ జరిగింది. తుది దశలో 40 నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగింది.

దశాబ్దకాలం తరువాత జరిగిన ఎన్నికలు కావడం వల్ల భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్, పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ ఈ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. హోరాహోరీగా ప్రచారం సాగింది. ఇక్కడ గెలిచేదెవరనేది ఈ నెల 8వ తేదీన ఓట్ల లెక్కింపు సందర్భంగా తేలిపోతుంది.
అదే సమయంలో హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలు కూడా పూర్తయ్యాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధినేత మల్లికార్జున్ ఖర్గే, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు.
అధికారాన్ని నిలబెట్టుకోవడానికి భారతీయ జనతా పార్టీ-జన్ నాయక్ జనతా పార్టీ సంకీర్ణ కూటమి, ఈ దఫా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే పట్టుదలతో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారపర్వాన్ని నిర్వహించాయి. మొత్తం 90 నియోజకవర్గాలు ఉన్న అసెంబ్లీపై ఏ పార్టీ పట్టు సాధిస్తుందనేది ఈవీఎంలల్లో నిక్షిప్తమైంది.
ఈ నెల 5వ తేదీన ఒకే దశలో హర్యానాలో పోలింగ్ పూర్తయిన విషయం తెలిసిందే. మంగళవారం (8వ తేదీ) ఓట్ల లెక్కింపు షెడ్యూల్ అయింది. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఇక్కడ పోల్ అయిన ఓట్లను కూడా అదే రోజున లెక్కిస్తారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి.
ఈ రెండు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సమగ్ర కవరేజీని ఎప్పటికప్పుడు అందించబోతోంది డైలీ హంట్. ఫలితాలపై వివరణాత్మక సమాచారం, అభ్యర్థుల జాబితా, వాళ్ల ప్రొఫైల్స్, రియల్ టైమ్ అప్‌డేట్స్, హైలైట్స్‌తో కూడిన కార్డ్స్, నిష్పక్షపాత విశ్లేషణలను అందించనుంది.
ఓట్ల లెక్కింపునకు సంబంధించిన వీడియోలు, లైవ్ కవరేజీ-అప్‌డేట్స్, ఇంటరాక్టివ్ క్విజ్.. వంటి వార్తల సమాహారం డైలీ హంట్ మల్టీమీడియా ప్లాట్ ఫామ్స్‌పై అందుబాటులో ఉండనుంది. సమాచారం కోసం సింగిల్ స్టాప్ డెస్టినేషన్‌గా ఇప్పటికే గుర్తింపు పొందింది డైలీహంట్. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.
రాష్ట్రాలు- నియోజకవర్గాల వారీగా 2019 నాటి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, తాజా రిజల్ట్స్‌తో కూడిన విశ్లేషణలు, మారిన స్థానాలు, టాప్ మైక్రో బ్లాగింగ్ ప్లాట్ ఫామ్ ఎక్స్‌పై సోషల్ మీడియాలో నెటిజన్లు పోస్ట్ చేసే రియాక్షన్లు, ట్రెండింగ్ టాపిక్స్, లైవీ వీడియోలు, వైరల్ మీమ్స్.. వంటి సమగ్ర ఎన్నికల కవరేజీ మీకోసం అందిస్తుంది డైలీహంట్.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications