ఫస్ట్ లిస్ట్ వచ్చేసింది..!!

Jammu Kashmir Assembly election 2024: ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోతోంది జమ్మూ కాశ్మీర్. దశాబ్ద కాలం తరువాత ఆ కేంద్ర పాలిత ప్రాంతానికి ఎన్నికలు జరుగనున్నాయి. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను సైతం కేంద్ర ఎన్నికల కమిషన్ ఇటీవలే విడుదల చేసింది. మొత్తం మూడు దశల్లో ఎన్నికలను నిర్వహించనున్నట్లు తెలిపింది.

జమ్మూ కాశ్మీర్‌లో ఉన్న మొత్తం అసెంబ్లీ నియోజకవర్గాలు.. 90. తొలి దశలో పుల్వామా, అనంత్‌నాగ్, షోపియాన్, కుల్గాం, రాంబన్, కి‌ష్తవార్, దోడా జిల్లాల్లో 24 స్థానాలకు సెప్టెంబర్ 18వ తేదీన ఓటింగ్ జరుగనుంది. గందర్‌బాల్, శ్రీనగర్, బుద్గాం, పూంఛ్, రియాసి, రాజౌరి జిల్లాల్లో గల 26 స్థానాలకు సెప్టెంబర్ 25న రెండో దశలో పోలింగ్ ఉంటుంది.

Jammu Kashmir Assembly elections 2024 National Conference announces names of 32 candidates

అక్టోబరు 1వ తేదీన చివరి దశలో బండీపొర, కుప్వారా, బారాముల్లా, ఉధంపూర్, జమ్ముూ, సాంబా, కథువా జిల్లాల్లో 40 సీట్లల్లో పోలింగ్ షెడ్యూల్ అయింది. భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ, అప్నీ పార్టీ, డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ, సీపీఎం ఈ ఎన్నికల బరిలో నిల్చోనున్నాయి.

మొత్తం 90 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 74 జనరల్, ఏడు ఎస్సీ, తొమ్మిది ఎస్టీ అభ్యర్థులకు రిజర్వ్‌డ్ స్థానాలు. మొత్తం 87,09,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో 44,46,000 వేల మంది పురుషులు, 42, 62,000 మంది మహిళలు ఉన్నారు. 3.71 లక్షల మంది మొదటి సారిగా ఓటు వేయనున్నారు.

ఈ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను జమ్మూ కాశ్మీర్ నేషనల్ ఫ్రంట్ విడుదల చేసింది. ఇందులో మొత్తం 32 మందికి చోటు దక్కింది. మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా గందర్‌బాల్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. జడీబాల్ నుంచి తన్వీర్ సాధిఖ్ బరిలో దిగారు.

కంగన్ (ఎస్టీ)- మియా మెహర్ అలీ, హజ్రత్‌బాల్- సల్మాన్ అలీ సాగర్, ఖన్యార్- అలీ మహ్మద్ సాగర్, హబ్బా కదల్- షమీమా ఫిర్దౌస్, లాల్ చౌక్- ఎహసాన్ పర్దేశి, ఛానాపొర- ముష్తాక్ గురూ, ఈద్గా- ముబారక్ గుల్, ఖాన్ సాహిబ్- సైఫుద్దీన్ భట్, పూంఛ్ హవేలీ- ఎజాజ్ అహ్మద్ జన్, కుప్వారా- నాసిర్ అసలాం వణీ, లొలబ్- ఖైసర్ జంషీడ్ లోన్ పోటీ చేయనున్నారు.

సొపొర్- ఇర్షాద్ రసూల్, రఫియాబాద్- జావిద్ అహ్మద్ దర్, యూరీ- డాక్టర్ సజద్ షఫీ యూరీ, బారాముల్లా- జావిద్ హుస్సేన్ బేగ్, తంగ్‌మార్గ్- ఫారూఖ్ అహ్మద్ షా, జమ్మూ నార్త్- అజయ్ కుమార్ సిద్ధోత్ర, నౌషేరా- సురీందర్ చౌదరి, గురెజ్- నాసిర్ అహ్మద్ గురెజ్, హంద్వారా- చౌదరి మహ్మద్ రంజాన్.. బరిలో దిగారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+