వైరల్ : కశ్మీర్ లో ఓటర్ సంతోషం.. పోలింగ్ కేంద్రం దగ్గర డ్యాన్స్ (వీడియో)

కశ్మీర్ : లోక్‌సభ ఎన్నికల వేళ ఆసక్తికర ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కొన్నిచోట్ల ఘర్షణలు తలెత్తితే.. మరికొన్ని చోట్ల ఆహ్లాదకరమైన వాతావరణం కనిపిస్తోంది. ఆ క్రమంలో సమస్యాత్మకమైన జమ్ముకశ్మీర్ లో ఒక ఓటర్ ఆనందంతో పరవశించిపోయాడు. పోలింగ్ కేంద్రం దగ్గర ఓటర్లు బారులు తీరితే.. వారిని ఉత్సాహపరిచేలా డ్యాన్స్ చేశాడు.

జమ్ము కశ్మీర్‌లోని ఓ పోలింగ్ స్టేషన్ దగ్గర ఓటర్ సందడి చేశాడు. పోలింగ్ కేంద్రం ఆవరణలో డ్యాన్స్ చేసి మిగతా ఓటర్లను ఉత్సాహపరిచాడు. బందిపోరా పార్లమెంటరీ స్థానానికి జరుగుతున్న ఎన్నికల్లో ఈ దృశ్యం కనిపించింది. అల్లర్లతో అట్టుడికిపోయే జమ్ముకశ్మీర్ లో ఓటర్ తన్మయత్వంతో డ్యాన్స్ చేయడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

jammu kashmir voter dance at polling station going viral

బారముల్లా, జమ్ము సెగ్మెంట్లలో సమస్యాత్మక ప్రాంతాలు ఎక్కువగా ఉండటంతో భారీ బందోబస్తు కొనసాగుతోంది. తుపాకుల నీడలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఎలాంటి హింసాత్మక ఘటనలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుందనడానికి ఓటర్ డ్యాన్స్ చేసిన వీడియో నిదర్శనమనే వ్యాఖ్యలు నెట్టింట్లో కనిపించాయి. ట్విట్టర్ లో పెట్టిన ఈ పోస్టుకు నెటిజన్లు వివిధ రూపాల్లో కామెంట్లు పెడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+