Janhvi Kapoor: చిన్న వయస్సులోనే అత్యంత ఖరీదైన ఇల్లు..మైండ్ బ్లాక్..!

అందాల అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ ఇప్పుడు బాలీవుడ్‌లో టాక్‌ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తోంది. ఆ మాటకొస్తే సినిమా ఇండస్ట్రీలోనే ఆమె టాపిక్ చర్చకు వస్తోంది. ఇందుకు కారణం ఈ మధ్యే ఆమె కొనుగోలు చేసిన ఇళ్లు ధర తెలిస్తే మైండ్ బ్లాక్ అవుతుంది. అవును నిజమే... ఈ జూనియర్ అతిలోక సుందరి తన సొంత ఇళ్లును ముంబైలో కొనుగోలు చేసింది. సాధారణంగా ఎక్కువ ధర పోసి పెద్ద పెద్ద బంగ్లాలే కొన్నవారు ముంబైలో ఉన్నారు. కానీ ఇంత చిన్న వయస్సులో మాత్రం అంత భారీ ధర చెల్లించి ఇళ్లు కొనుగోలు చేయడంతోనే జాన్వీ కపూర్ వార్తల్లో నిలిచింది.

 ఖరీదైన ఫ్లాట్స్ కొనుగోలు చేసిన జాన్వీ

ఖరీదైన ఫ్లాట్స్ కొనుగోలు చేసిన జాన్వీ

గతేడాది జాన్వీ కపూర్ నటించిన గుంజన్ సక్సేనా విడుదలై విజయం సాధించడం అదే సమయంలో విమర్శలను సైతం ఎదుర్కొంది. ఈ విజయంతో జాన్వీ కపూర్ ఖాతాలో వరుస సినిమాలు క్యూ కట్టాయి. ఇక సినిమాల సంగతి అటుంచితే మూడు విలాసవంతమైన ఫ్లాట్లను ఒకే అపార్ట్‌మెంట్‌లో కొనుగోలు చేసిన విషయమే ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువగా చర్చకు దారితీస్తోంది. అది కూడా ముంబైలోని అత్యంత ఖరీదైన ప్రాంతమైన జూహూలో ఈ మూడు ఫ్లాట్లను కొనుగోలు చేసినట్లు సమాచారం.

అక్షరాల రూ.39 కోట్లు

గతేడాది డిసెంబర్ నెలలోనే ఈ ఖరీదైన ఫ్లాట్లను జాన్వీ కపూర్ రూ.39 కోట్లు పెట్టి కొనుగోలు చేసినట్లు సమాచారం. మొత్తం మూడు ఫ్లోర్లలో మూడు ఫ్లాట్స్‌ను కొనుగోలు చేసింది ముద్దుగుమ్మ. గతేడాది డిసెంబర్ 7వ తేదీన కొనుగోలుకు డీల్ ఫిక్స్ చేసిన జాన్వీ కపూర్... ఒక్క స్టాంప్ డ్యూటీ ఖర్చులే రూ.78 లక్షలు చెల్లించిందని బాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ బిల్డింగ్‌లో జాన్వీ కపూర్‌కు ఆరు పార్కింగ్ స్పేస్‌లు ఉన్నాయట. ఈ అపార్ట్‌మెంట్‌లో మొత్తం మూడు ఫ్లాట్స్‌కు గాను రూ.39 కోట్లు చెల్లించింది.

 హృతిక్ రోషన్ కొత్త ఇల్లు ధర రూ.97 కోట్లు

హృతిక్ రోషన్ కొత్త ఇల్లు ధర రూ.97 కోట్లు

ఇదిలా ఉంటే బాలీవుడ్ హార్ట్ థ్రోబ్ హృతిక్ రోషన్ అదే జూహూ ప్రాంతంలో రూ.97 కోట్లతో ఖరీదైన భవనంను కొనుగోలు చేసిన కొద్ది రోజులకే జాన్వీ కపూర్ తనకు ఇష్టమైన ఇంటిని సొంతం చేసుకుంది. జూహూ ప్రాంతంలో మూడు ఫ్లాట్స్‌ను కొనుగోలు చేసిన హృతిక్ రోషన్... వాటన్నిటినీ ఇంటర్‌కనెక్ట్ చేయడం జరిగింది. అంతేకాదు ఆ మూడు ఫ్లాట్స్‌నుంచి చూస్తే ఎదురుగా అరేబియన్ సముద్రం కనిపిస్తుంది. మరొకటి పెంట్ హౌజ్. ఇది 6500 చదరపు అడుగుల్లో ఉంది. ఇక జాన్వీ కపూర్ తీసుకున్న ఫ్లాట్ పరిసరాల్లో సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, అజయ్ దేవగన్, అనిల్ కపూర్‌ల నివాసాలు కూడా ఉన్నాయి. ఇక సినిమాల విషయానికొస్తే జాన్వీ కపూర్ దోస్తానా 2లో నటిస్తోంది. రూహీ అఫ్జానా అనే మరో చిత్రంలో కూడా నటిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+