వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీకి నాతోనే వివాహమైంది, ఆయన శ్రీరాముడు: ఆనందిబెన్‌కు జశోదాబెన్ కౌంటర్

|
Google Oneindia TeluguNews

గాంధీనగర్: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అవివాహితుడు కాదని, ఆయనకు తనతోనే వివాహమైందని జశోదాబెన్ స్పష్టం చేశారు. ప్రధాని మోడీకి వివాహం కాలేదంటూ ఇటీవల మధ్యప్రదేశ్ గవర్నర్ ఆనందిబెన్ పటేల్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

ఆ వ్యాఖ్యలు బాధాకరం

ఆ వ్యాఖ్యలు బాధాకరం

కాగా, ఆమె వ్యాఖ్యలు మీడియాతోపాటు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో ప్రధాని సతీమణి జశోదాబెన్ ఆమె వ్యాఖ్యాలపై తీవ్రంగా స్పందించారు. ప్రధానిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాధాకరమని ఆమె అన్నారు.

ఆనందిబెన్‌కు జశోదా ప్రశ్న

ఆనందిబెన్‌కు జశోదా ప్రశ్న

‘ఆనందిబెన్ పటేల్ వ్యాఖ్యల గురించి తెలిసి ఆశ్చర్యపోయాను. ప్రధాని మోడీకి పెళ్లి కాలేదని ఎలా అంటారు? లోకసభ ఎన్నికల సందర్భంగా వేసిన నామినేషన్‌లో తనకు వివాహం అయ్యిందని, భార్య పేరు జశోదాబెన్ అని ఆయనే(ప్రధాని మోడీ) స్వయంగా పేర్కొన్నారు. అలాంటప్పుడు ఆనందిబెన్ పటేల్ ఇలాంటి వ్యాఖ్యలు ఎలా చేశారు' జశోదాబెన్ ప్రశ్నించారు.

మోడీ.. శ్రీరాముడి లాంటివారు

మోడీ.. శ్రీరాముడి లాంటివారు

అంతేగాక, ‘ఉన్నత చదువులు చదివిని ఓ మహిళ(ఆనందిబెన్).. ఓ సామాన్య టీచర్(జశోదాబెన్) గురించి ఇలా మాట్లాడటం ఆశ్చర్యంగా ఉంది. ఇదే కాదు.. ఆమె గతంలో చేసిన కొన్ని పనులు ప్రధాని పేరును చెడగొట్టేలా ఉన్నాయి. నా వరకు ఆయన(నరేంద్ర మోడీ) ఎంతో గౌరవనీయమైన వ్యక్తి. రాముడి లాంటి వారు' అని జశోదాబెన్ ఓ వీడియో సందేశంలో పేర్కొన్నారు.

Recommended Video

పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుమొఖం
అందుకే జశోదాబెన్ స్పందించారు

అందుకే జశోదాబెన్ స్పందించారు

గుజరాత్ మాజీ సీఎం అయిన ఆనందిబెన్ పటేల్ ప్రస్తుతం మధ్యప్రదేశ్‌ గవర్నర్‌గా పనిచేస్తున్నారు. కాగా, ఆనందిబెన్ పటేల్.. ప్రధాని మోడీకి వివాహం కాలేదంటూ చేసిన వ్యాఖ్యలు జూన్ 19న స్థానిక పత్రికల్లో వచ్చాయి. ఆ తర్వాత సోషల్ మీడియాలో ఆమె వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. ఈ క్రమంలోనే ఆనందిబెన్ వ్యాఖ్యలపై తమ సోదరి స్పందించాల్సి వచ్చిందని జశోదాబెన్ సోదరుడు అశోక్ తెలిపారు.

English summary
Prime Minister Narendra Modi’s estranged wife Jashodaben on Wednesday expressed her shock over Madhya Pradesh Governor and former Gujarat chief minister Anandiben Patel’s statement in a leading Gujarati daily that Modi was unmarried.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X