Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఆపరేషన్ వీరప్పన్ కు జయ విశ్వాసమే కారణమా

వీరప్పన్ ను పట్టుకొనేందుకు జయ విశ్వాసమే కీలకంగా పనిచేసిందని ఈ ఆపరేషన్ కు నాయకత్వం వహించిన ఐపిఎస్ అధికారి విజయ్ కుమార్ చెప్పారు. ఏరికోరి అధికారులను ఎంపిక చేసుకొని ఆమె బాధ్యతలను అప్పగిస్తారని చెప్పారు.

చెన్నై :కొందరు అధికారులంటే జయలలితకు చాలా గురి, వారికి అప్పగించిన పనులను వారు నిర్విఘ్నంగా పూర్తిచేస్తారని విశ్వాసంతో ఉండేవారు. ఎవరికి ఏ పని అప్పగించారో ఆ పని గురించి ఆమె ఎప్పుడూ అడిగేవారు కాదు, ఆపరేషన్ వీరప్పన్ ను విజయవంతం కావడానికి అధికారులపై ఆమె ఉంచిన విశ్వాసమేనని అధికారులు చెబుతున్నారు.

jaya :i confident your team complete your task on veerappan operation

పనితీరును అంచనావేసి బాధ్యతల అప్పగింత

అధికారుల పనితీరును అంచనావేసేవారు జయలలిత. వారు చేయగలిగిన సామర్థ్యం ఉన్నవారని భావిస్తే వెంటనే వారికి ఆ పనులను అప్పగించేవారు. ఆ పని పూర్తయ్యేవరకు ఆ పనుల గురించి ఆమె అడిగేవారు కాదట. ఆ పని గురించి భాద్యతలు తీసుకొన్న వారే చెబితే వినేవారు. కాని, ఆ పనుల గురించి ఎప్పుడూ సమీక్షలు నిర్వహించేవారు కాదట, ఇతరుల ముందు ఆ పనుల గురించి ప్రస్తావించే వారు కాదు.

jaya :i confident your team complete your task on veerappan operation

ఆపరేషన్ వీరప్పన్ కు విజయ్ కుమార్ కు భాద్యతలు

ఐపిఎస్ అధికారి విజయ్ కుమార్ కు ఆపరేషన్ వీరప్పన్ ఇవ్వడంలో ఆయన పనితీరును ఆసరాగా చేసుకొని ఈ ఆపరేషన్ కు ఆమె విజయ్ కుమార్ ను ఎంపిక చేసుకొన్నారు. గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ ను మట్టుబెట్టేందుకు చాలా కాలంపాటు ప్రభుత్వాలు పనిచేసి వైఫల్యం చెందాయి.అయితే జయలలిత ఏరికోరి ఎంపిక చేసిన విజయ్ కుమార్ టీమ్ ఈ ఆపరేషన్ ను విజయవంతంగా పూర్తి చేసింది.

నా మీద నమ్మకం ఉంచారు.

jaya :i confident your team complete your task on veerappan operation

వీరప్పన్ ను కాల్చి చంపేందుకు ఏడు మాసాల ముందు ఎన్నికల ప్రచారంలో జయలలిత చాలా బిజీగా ఉన్నారు.ఆపరేషన్ పనిమీదే తాను చెన్నై వచ్చాను. అయితే ఆ సమయంలో ఎన్నికల ప్రచారంలో ఆమె బిజీగా ఉన్నారు. అయితే ఆమెను కలవాల్సిన పరిస్థితులు కూడ లేవు. అయితే మర్యాదపూర్వకంగానే జయను కలిశాను. వీరప్పన్ ను పట్టుకొనేందుకు చేయాల్సిందంతా చేస్తున్నామని విజయ్ కుమార్ జయకు చెప్పారు. అయితే ఈ ఆపరేషన్ ను పూర్తి చేస్తారని ఆమె తనపై విశ్వాసాన్ని ఉంచారని ఆయన గుర్తుచేసుకొన్నారు.

ఆమె విశ్వాసం ఆశ్చర్యానికి గురిచేసింది.

jaya :i confident your team complete your task on veerappan operation

ఆపరేషన్ వీరప్పన్ కు తనను టీమ్ లీడర్ గా ఎంపిక చేసిన తర్వాత ఏనాడు కూడ ఆపరేషన్ ఎంతవరకు వచ్చిందని ఆమె అడగలేదు. కాని, తానే ఈ ఆపరేషన్ గురించి వివరించే ప్రయత్నం చేస్తే మీరు ఈ పని పూర్తి చేస్తారనే విశ్వాసాన్ని ఆమె వ్యక్తం చేసేవారని ఆయన గుర్తుచేసుకొన్నారు.వీరప్పన్ ను అరెస్టు చేసేందుకు ఐదువారాల ముందు సెయింట్ జార్జి ఫోర్ట్ లో కలుసుకొన్నామని ఆ రోజు ఆమె అన్న మాటలు విని షాక్ కు గురయ్యాయని చెప్పారు. మీకు అప్పగించిన పనిని త్వరలోనే పూర్తి చేస్తారని నాకు అనిపిస్తోందని ఆమె విజయ్ కుమార్ తో చెప్పారు.జయలలిత విశ్వాసం ఆదారంగానే తమ టీమ్ వీరప్పన్ ను మట్టుబెట్టిందని ఆయన చెప్పారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+