రాంపూర్ కా రాణి కంట కన్నీరు : ఎస్పీ నేతలు బెదిరిస్తున్నారన్న జయప్రద, అండగా నిలిచిన బీజేపీ
రామ్‌పూర్ : ఇటీవలే బీజేపీలో చేరిన జయప్రద సభ వేదికపై బోరున ఏడ్చారు. తాను బీజేపీలో చేరడాన్ని కొందరు జీర్ణించుకోలేరన్నారు. బీజేపీలో చేరొద్దని, రాంపూర్ నుంచి పోటీచేయొద్దని బెదిరించారని రోదించారు. వెంటనే అక్కడున్న కార్యకర్తలు ఆమెను ఓదార్చి .. అండగా మేమున్నామంటూ ధైర్యం నూరిపోశారు.

బర్త్ డే గిప్ట్ .. బెదిరింపులు
తన పుట్టిన రోజున బీజేపీ రాంపూర్ టికెట్ ఇచ్చి బహుమతి ఇచ్చిందని గుర్తుచేశారు. మరోసారి ప్రజలకు సేవ చేసే అవకాశం వచ్చిందని భావించానని తెలిపారు. అయితే ఎస్పీ నేత అజాంఖాన్ తనపై ఆరోపణలు చేశారని ... రాంపూర్ వదిలివెళ్లాలని బెదిరించారని వెల్లడించారు. ఇక్కడే ఉండే యాసిడ్ దాడులు చేస్తానని హెచ్చరించారని గద్గత స్వరంతో రోదించారు. మీకు అండగా మేమున్నామంటూ కార్యకర్తలు ధైర్యం చెప్పడంతో తేరుకున్నారు.
ఇంకెప్పుడు ఏడవను, అండగా బీజేపీ
తన వెనక బీజేపీ ఉంది. ఇంతకుముందులా ఏడవను, తనకు జీవించే హక్కు ఉన్నది, ఎవరూ ఏమీ చేయలేరు అని పేర్కొన్నారు జయప్రద. ప్రజాసేవ కోసం బీజేపీ మంచిదనిపించి చేరానని తెలిపారు. రాంపూర్ నుంచి గెలవాలని దేవుడిని ప్రార్థిస్తున్నానని .. మరోసారి ప్రజాసేవ చేసే అవకాశం ఇవ్వాలని కోరారు. ప్రజల ఆశీర్వాదం ముందు ఏ బెదిరింపులు పనిచేయవని స్పష్టంచేశారు.
-
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
రూపాయి సేఫ్: ఒక్కరోజే భారీ లాభం!












Click it and Unblock the Notifications