ఆమెకు ధైవభక్తి కూడ ఎక్కువే, సంఖ్యాశాస్త్రాన్ని విశ్వసిస్తారు
జయలలితకు ధైవభక్తి ఎక్కువే. సంప్రదాయ కుటుంబంలో పుట్టిన ఆమె ధైవభక్తిని విశ్వసిస్తారు. తాను కోరుకొన్నట్టు జరిగిన వెంటనే ఆమె దేవాలయాల్లో పూజలు నిర్వహించేవారని ఆమె సన్నిహితులు చెబుతారు.
చెన్నై : జయలలితకు ధైవభక్తి ఎక్కువేనట. సంప్రదాయ కుటుంబంలో పెరిగిన వాతావరణంతో ఆమెకు ధైవభక్తి ఎక్కువగా ఉండేదని ఆమె సన్నిహితులు చెబుతుంటారు. తాను కోరుకొన్నది జరిగిన వెంటనే దేవుళ్ళకు పూజలు, హోమాలు చేయడం కార్యక్రమాలకు ఆమె అత్యధిక ప్రాధాన్యత ఇచ్చేవారు.
టాన్సీ కేసులో విడుదల కాగానే ఆమె తన సహచరి శశికళతో కలిసి దేవాలయానికి వెళ్ళి అర్చన చేశారు. గురువాయూర్ దేవాలయానికి వెళ్ళిన ఆమె ఒక ఏనుగును కూడ ఆ దేవాలయానికి బహుమానంగా ఇచ్చారు. విశ్వాసాలు, నమ్మకాలపై కూడ ఆమె ఎక్కువగా ఆధారపడేవారని తమిళనాడులో ప్రచారంలో ఉంది.

సంఖ్యా శాస్త్రాన్ని ఆమె విశ్వసించేవారు. తన పేరులో 'ఎ' ను అదనగంగా చేర్చితే ప్రయోజనం అని చెబితే ఆమె అదే ప్రకారం చేశారు. మరో వైపు 9 అంకె అంటే ఆమె అధిక ఇష్టపడుతారు. రంగులకు కూడ ఆమె అధిక ప్రాదాన్యత ఇసస్తారు. తాను ధరించే దుస్తులకు సంబందించిన రంగుల విషయంలో జాగ్రత్తలు తీసుకొంటారు.
కొంతకాలం ప ాటు ముదురు ఆకుపచ్చ రంగు చీరెలనే ఆమె ధరించేవారు. తర్వాత ముదురు నీలంరంగు చీరెలకు ఆమె ప్రాధాన్యత ఇచ్చారు.జయలలితకు ఏమి ఇష్టమో వాటిని పార్టీ నాయకులు, కార్యకర్తలు పాటించేవారు. ఆమె ముదురు ఆకుపచ్చ చీరెలు ధరించే సమయంలో పార్టీ కార్యకర్తలు ఎక్కువగా ఆకుపచ్చ రంగుకే అధిక ప్రాధాన్యత ఇచ్చేవారు.ఆమె జరిపించిన సామూహిక వివాహల్లో వధువులంతా ఆకుపచ్చ రంగు చీరెలనే ధరించేవారు.












Click it and Unblock the Notifications