జయకు కృత్రిమ శ్వాస: తాజా హెల్త్ బులిటెన్‌లో అపోలో వైద్యులు
చెన్నై: గత నెల 22 నుంచి చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యంపై అపోలో వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. వైద్య చికిత్సకు జయలలిత త్వరితగతిన స్పందిస్తున్నారని అపోలో వైద్యులు వెల్లడించారు.
ప్రస్తుతం జయ ఊపిరితిత్తుల్లో నెమ్ము తొలగింపు ప్రక్రియ కొనసాగుతోందని పేర్కొన్నారు. ఇన్ఫెక్షన్ కు యాంటీ బయాటిక్స్ అందిస్తున్నామని వైద్యులు చెప్పారు. ఆమెకు న్యూట్రీషన్స్‌తో కూడిన ద్రవపదార్థాలు అందిస్తున్నట్లు తెలిపారు. జయలలితకు కృత్రిమ శ్వాస అందిస్తున్నామని, ప్రస్తుతం ఊపిరితిత్తులకు చికిత్స కొనుసాగుతోంది పేర్కొన్నారు.

ఫిజయో ధెరపీ కూడా చేస్తున్నట్లు వివరించారు. ప్రత్యేక వైద్య నిపుణుల బృందం జయలలితను ఎప్పటికప్పుడు పరీక్షిస్తోందని తెలిపారు. జయలలితకు ప్రస్తుతం చికిత్స అందిస్తున్నామని, ఆమె పూర్తిస్థాయిలో కోలుకునే వరకు ఆసుపత్రిలోనే ఉంటారని మరోసారి ప్రకటించారు.
సెప్టెంబర్ 22న జ్వరం, డీహైడ్రేషన్ సమస్యలతో బాధపడుతున్న జయలలితను చెన్నైలోని అపోలో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్న సంగతి తెలిసిందే. రెండు వారాలు గడిచినా అమ్మ జయలలిత అనారోగ్యం నుంచి కోలుకోకపోవడంతో పార్టీ నేతలు, ఆమె అభిమానులు ఆందోళన చెందుతున్నారు.












Click it and Unblock the Notifications