వీడియోలో ఉన్నది జయలలిత కాదు, అమ్మ ఫ్రెండ్ గీతా, శశికళ ఏం చేశారంటే ?
చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతి చెందక ముందు అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో తీసిన వీడియో నకిలి, దానిని సరికొత్త టెక్నాలజీతో సృష్టించారని అమ్మ స్నేహితురాలు గీతా ఆరోపించారు.

వీడియోలో ఉన్నది అమ్మ కాదు
గురువారం టీటీవీ దినకరన్ వర్గం విడుదల చేసిన వీడియోలో ఉన్నది తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత కాదని ఆమె స్నేహితురాలు గీతా అన్నారు. టీవీలో తాను వీడియో చూశానని, అందులో ఉన్నది వంద శాతం జయలలిత కాదని గీతా చెప్పారు.
Recommended Video


మార్ఫింగ్ వీడియో
సరికొత్త టెక్నాలజీతో మార్ఫింగ్ చేసి వీడియోలో ఉన్నది జయలలిత అని నమ్మించడానికి శశికళ కుటుంబ సభ్యులు ప్రయత్నిస్తున్నారని, ఆ వీడియోను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని పరిశీలించాలని జయలలిత స్నేహితురాలు గీతా డిమాండ్ చేశారు.

ఆసుపత్రికి వెళ్లే ముందే అమ్మ ?
జయలలిత ఆసుపత్రిలో చేర్చేనాటికే మృతిచెందారని గతంలో ఆరోపణలు కూడా వచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయంపై అప్పట్లో టీటీవీ దినకరన్ కూడా స్పందించారు. అమ్మ ఆసుపత్రిలో బతికే ఉందని చెప్పేందుకు తమ వద్ద సాక్ష్యాలు ఉన్నాయని టీటీవీ దినకరన్ చెప్పారు.

అమ్మ కోసం !
తాను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో ఫోటోలు, వీడియోలు తీసి బయటకు విడుదల చెయ్యరాదని జయలలిత చెప్పారని, అమ్మ కోరిక మేరకు వాటిని విడుదల చెయ్యబోమని టీటీవీ దినకరన్ అన్నారు.

ఇప్పుడు ఎవరి కోసం ?
గురువారం టీటీవీ దినకరన్ వర్గం అనర్హత ఎమ్మెల్యే వెట్రివేల్ ఈ వీడియోను బహిర్గతం చేయడం గమనార్హం. ఇప్పుడు ఎవరి కోసం ఈ వీడియో విడుదల చేశారు అనే ప్రశ్నకు మన్నార్ గుడి మాఫియా సమాధానం చెప్పాలని తమిళనాడు ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

విచారణ కమిషన్ కు వీడియో !
జయలలిత మృతిపై దర్యాప్తు చేసేందుకు తమిళనాడు ప్రభుత్వం ఏర్పాటు చేసిన మద్రాసు హైకోర్టు రిటైడ్ న్యాయమూర్తి ఆర్ముగస్వామి విచారణ కమిషన్ అపోలో ఆసుపత్రిలో జయలలిత చికిత్స పొందుతున్న సమయంలో తీసిన వీడియో అంటూ విడుదల చేసిన క్లిప్పింగ్స్ పరిశీలిస్తున్నారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications