నిర్దోషిగా జయ: సుప్రీంకు వెళ్లాలని కర్ణాటక ప్రభుత్వాన్ని కోరిన తమిళ ప్రతిపక్ష పార్టీలు

చెన్నై: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అన్నాడీఎంకే అధినేత్రి జయలలితను నిర్దోషిగా ప్రకటించడాన్ని తమిళనాడులోని ప్రతిపక్ష పార్టీలు తట్టుకోలేకపోతున్నాయి. ఈ నేపథ్యంలో జయలలిత కేసులో కర్ణాటక హైకోర్టు ప్రకటించిన తీర్పును సుప్రీం కోర్టులో సవాల్ చేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని తమిళనాడుకు చెందిన పార్టీలు కోరాయి.

డీఎంకే అధినేత కరుణానిధి సహా ఇతర ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వానికి ఈ విషయాన్ని విన్నవించాయి. జయలలిత తీర్పుపై తమిళనాడుకి చెందిన పీఎంకే, కాంగ్రెస్ పార్టీలు తమ నిస్సహాయతను వ్యక్తం చేశాయి. ముఖ్యంగా ఏవైతే ఆరోపణులను ఆమె ఎదుర్కొన్నారో... ఆస్తులు, ఖర్చులు లెక్కింపు సరిగ్గా లేదన్నారు.

సీబీఐ ప్రత్యేక కోర్టు, హైకోర్టు తీర్పుల్లో చాలా తేడా ఉందని తమిళనాడు కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఇళంగోవన్ అభిప్రాయపడ్డారు. కాబట్టి కర్ణాటక ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టులో అప్పీలు చేయాలని కోరారు. ఇక జయలలిత కేసులో హైకోర్టు తీర్పును తాను ఊహించలేకపోయానని డీఎండీకే చీఫ్ విజయకాంత్ అన్నారు.

 Jayalalithaa acquittal: TN opposition parties urge Karnataka to file appeal in SC

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు సోమవారం ఊరట లభించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆమెను నిర్దోషిగా తేలుస్తూ న్యాయస్థానం తీర్పు ప్రకటించింది. సెషన్స్ కోర్టు తీర్పును హైకోర్టు రద్దు చేసింది. ఈ కోర్టు తీర్పుతో ఆమె మళ్లీ ముఖ్యమంత్రి అయ్యేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి.

హైకోర్టులో తనకు అనుకూలంగా వచ్చిన జయలలిత స్పందించారు. ఇది తన వ్యక్తిగత విజయంగా భావించడం లేదని చెప్పారు. ఎప్పటికైనా ధర్మం గెలుస్తుందన్నారు. రాజకీయ కుట్రతోనే తన పైన తప్పుడు ఆరోపణలు చేశారని ఆమె చెప్పారు. ఎన్ని కుట్రలు చేసినా చివరకు ధర్మమే గెలిచిందనే విషయం అందరు గుర్తించాలని ప్రకటించారు.

హైకోర్టు తీర్పుపై సుబ్రహ్మణ్య స్వామి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సుప్రీం కోర్టుకు వెళ్తామని, జయలలితకు శిక్ష పడేలా చేస్తామన్నారు. జయలలితకు అక్రమాస్తుల కేసులో నాలుగేళ్ల జైలు శిక్ష, రూ.100 కోట్ల జరిమానా విధిస్తూ గతంలో న్యాయస్థానం తీర్పు చెప్పింది. దీనిపై జయలలిత హైకోర్టును ఆశ్రయించగా.. సెషన్స్ కోర్టు తీర్పును కొట్టివేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+