పక్క రాష్ట్ర సీఎంకు జయలలిత శుభాకాంక్షలు
చెన్నై: అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. విజయన్ ఇటీవలే ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఆమె ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
ఇటీవల అయిదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. తమిళనాడు, కేరళ రాష్ట్రాలు అందులో ఉన్నాయి. తమిళనాడులో అన్నాడీఎంకే తిరిగి అధికారంలోకి వచ్చింది. కేరళలో యూడీఎఫ్ పోయి లెఫ్ట్ నేతృత్వంలోని ఎల్డీఎఫ్ అధికారంలోకి వచ్చింది. విజయన్ సీఎంగా బాధ్యతలు చేపట్టారు.

ఈ నేపథ్యంలో జయలలిత.. కేరళలో అద్భుత విజయం సాధించి గెలిచిన లెఫ్ట్ పార్టీకి, ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విజయన్‌కు శుభాకాంక్షలు అని తెలిపారు. ఆమె ఆయనకు లేఖ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. కేరళను మీ పాలనలో మంచి అభివృద్ధిలోకి తీసుకు వెళ్తారని భావిస్తున్నానని ఆమె పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications