వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జయలలితను సిఎంగా చూడాలని.. శిలువ వేసుకున్న అభిమాని (ఫోటోలు)

|
Google Oneindia TeluguNews

చెన్నై: అన్నాడిఎంకె అధ్యక్షురాలు, మాజీ ముఖ్యమంత్రి జయలలిత తిరిగి ముఖ్యమంత్రి కావాలని ఓ అభిమాని తీవ్రమైన నిర్ణయం తీసుకున్నాడు. రాష్ట్రానికి జయలలిత తిరిగి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటూ అతను తనకు తానే శిలువ వేసుకున్నాడు.

కరాటే నిపుణుడైన శిహాన్ హుస్సేన్.. చేతులకు, కాళ్లకు మేకులు కొట్టుకుని తన అభిమానాన్ని చాటుకున్నాడు. శిలువ ఆకారంలో ఉన్న కర్రదుంగలకు కట్టేసుకుని.. 6 ఇంచుల మేకులు కొట్టించుకుని అతడు అలాగే శిలువకు నిలబడిపోయాడు. సుమారు 10 నిమిషాలపాటు అతడు అలాగే నిల్చున్నాడు.

అమ్మ(జయలలిత)ను తిరిగి తమిళనాడు ముఖ్యమంత్రిని చేయాలని కోరుకుంటున్నట్లు హుస్సేన్ తెలిపాడు. త్వరలో పుట్టిన రోజు వేడుకలు జరుపుకోనున్న జయలలితకు.. ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపాడు.

జయలలితపై వీరాభిమానం

జయలలితపై వీరాభిమానం

అభిమానం ఎక్కువై శివాన్ హుస్సేన్ అనే వ్యక్తి జయలలితను తిరిగి ముఖ్యమంత్రిని చేయాలని కోరుతూ ఇలా శిలువ వేసుకున్నాడు.

జయలలితపై వీరాభిమానం

జయలలితపై వీరాభిమానం

కోర్టు కేసుల కారణంగా అనివార్యంగా జయలలిత తన శాసనసభ సభ్యత్వానికి, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. అభిమానికి అవేమీ అవసరం లేదు.

జయలలితపై వీరాభిమానం

జయలలితపై వీరాభిమానం

చేతులకు, కాళ్లకు మేకులు కొట్టుకుని జయలలిత వీరాభిమాని ఇలా తనను తాను శిలువ వేసుకున్నాడు. ఇలా అతను తెగించాడు.

జయలలితపై వీరాభిమానం

జయలలితపై వీరాభిమానం

జయలలితపై వీరాభిమానం ప్రకటించుకుంటూ శిలువ వేసుకోవడానికి సిద్ధపడిన వ్యక్తికి మరింత మంది సహకారం అందించారు.

జయలలితపై వీరాభిమానం

జయలలితపై వీరాభిమానం

జయలలితపై అభిమానం ఎక్కువై ఆమెను తిరిగి ముఖ్యమంత్రిని చేయాలని డిమాండ్ చేస్తూ హుస్సేన్ తనను తాను శిలువ వేసుకున్నాడు.

జయలలితపై వీరాభిమానం

జయలలితపై వీరాభిమానం

జయలలితపై వీరాభిమానంతో హుస్సేనే చేతులకు, కాళ్లకు మేకులు కొట్టుకున్నాడు. శిలువెక్కాడు. దీనికి మరికొంత మంది సహకరించారు.

జయలలితపై వీరాభిమానం

జయలలితపై వీరాభిమానం

మాజీ ముఖ్యమంత్రి, అన్నాడియంకె అధినేత జయలలితపై అభిమానం కట్టలు తెంచుకుని, ఓ వ్యక్తి ఇలా శిలువెక్కాడు.

విషయం తెలుసుకున్న అన్నాడిఎంకె కార్యకర్తలు అతని వద్దకు భారీ సంఖ్యలో తరలివచ్చారు. కాగా, మేకులు కొట్టడంతో అతని చేతులు, కాళ్ల నుంచి తీవ్రంగా రక్త స్రావమైంది. దీంతో అతడు స్పృహ కోల్పోయాడు. వెంటనే అతడ్ని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టైన జయలలిత.. ఇటీవల బెయిల్‌పై విడుదలైన విషయం తెలిసిందే. ఆ కేసులో కోర్టు దోషిగా తేల్చడంతో జయలలిత తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.

English summary
A karate expert and supporter of AIADMK chief Jayalalitha crucified himself on Monday as he demanded the leader’s return as Tamil Nadu Chief Minister.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X