శశికళ మీద కోపంతో జయలలిత ఆత్మ ఇలా తిరుగుతుందా ?

ఎప్పటికీ తాను రాజకీయాల్లోకి రానని, అన్నాడీఎంకే పార్టీ విషయాల్లో జోక్యం చేసుకోనని జయలలితకు ఒట్టు వేసిన శశికళ ఇప్పుడు మాట తప్పారని, అందుకే జయలలిత ఆత్మ ఇలా తిరుగుతోందని సోషల్ మీడియాలో ఓ వీడియో .

చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి శశికళ అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తప్పుకోవాలని ఆ పార్టీ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు శశికళ మీద జయలలిత ఆత్మ కోపంగా తిరుగుతుందని సోషల్ మీడియాలో, తమిళనాడులో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.

నెచ్చెలి శశికళ బహిష్కరణ ! అన్నాడీఎంకే లీడర్స్

జయలలిత మృతి చెందిన తరువాత ఆమె అంత్యక్రియలు హిందూ సాంప్రధాయం ప్రకారం నిర్వహించలేదని, అమ్మ ఆత్మశాంతించదని కర్ణాటకలోని మేలుకోటేలో ఉన్న జయలలిత బంధువులు తీవ్రస్థాయిలో విమర్శించిన విషయం తెలిసిందే.

In This photo J Jayalalithaa GHOST So Angry With AIADMK Chief Sasikala Natarajan ?

ఎప్పటికీ తాను రాజకీయాల్లోకి రానని, అన్నాడీఎంకే పార్టీ విషయాల్లో జోక్యం చేసుకోనని, తన బంధువులను దగ్గరకు రానివ్వనని జయలలితకు ఒట్టు వేసిన శశికళ ఇప్పుడు మాట తప్పారని, అందుకే జయలలిత ఆత్మ తిరుగుతోందని సోషల్ మీడియాలో, తమిళనాడు మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి.

అన్నాడీఎంకేలో అసమ్మతి చిచ్చు: దొరైస్వామి, మాజీ స్పీకర్ దెబ్బ

కారు పార్కింగ్ స్థలంలో జయలలిత ఆత్మ సంచరిస్తూ శశికళ మీద కోపంగా తిరుగుతుందని, పార్కింగ్ స్థలంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో ఆ దృశ్యాలు రికార్డు అయ్యాయని చెబుతూ ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

శశికళ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్న అన్నాడీఎంకే కార్యకర్తలు ఇప్పుడు నిజంగానే అమ్మ ఆత్మ ఇక్కడ తిరుగుతుందని, ఇది నిజం అంటు ప్రచారం చేస్తున్నారు. మొత్తం మీద జయలలిత ఆత్మ సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యిందని ఓ వీడియో సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ అయ్యింది. అయితే ఎవరో కావాలని ఇలా తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నాడీఎంకే నాయకులు ఆరోపిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+