జయలలికు కుమార్తె ఉన్న మాట నిజమే: 1980లో, ఎవరు అనేది, బాంబుపేల్చిన లలిత !
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు ఓ కుమార్తె ఉన్న మాట వాస్తవమే, అయితే ఆమె కుమార్తె అమృత అలియాస్ మంజులనా ? కాదా ? అనే విషయం మాత్రం తనకు కచ్చితంగా తెలీదని జయ సమీప బంధువు లలిత బాంబుపేల్చారు.
బెంగళూరు: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు ఓ కుమార్తె ఉన్న మాట వాస్తవమే, అయితే ఆమె కుమార్తె అమృత అలియాస్ మంజులనా ? కాదా ? అనే విషయం మాత్రం తనకు కచ్చితంగా తెలీదని జయ సమీప బంధువు లలిత బాంబుపేల్చారు.
మంగళవారం బెంగళూరులో సన్ టీవీ న్యూస్ కు ఇచ్చిన ఇంటర్వూలో లలిత ఆసక్తికర విషయాలు వెల్లడించారు. జయలలిత తండ్రి జయరామ్ సోదరి కుమార్తె లలిత. లలిత బెంగళూరులోనే నివాసం ఉంటున్నారు. తాను జయలలిత కుమార్తె అనే విషయం లలిత చెప్పారని ఇటీవల అమృత చెప్పిన విషయం తెలిసిందే.

నేను ఎవరో కాదు !
జయలలిత కుమార్తె విషయంపై సన్ న్యూస్ టీవీ చానల్ మంగళవారం బెంగళూరులో లలిత ఇంటర్వూ తీసుకునింది. ఆ సందర్బంలో లలిత ఇలా గతం గురించి మాట్లాడారు. తాను జయలలిత తండ్రి జయరామ్ సోదరి కుమార్తె అని లలిత వివరించారు.

1970లో జయలలితకు, మాకు ?
1970 నుంచి బెంగళూరులో ఉన్న తమకి చెన్నైలో ఉన్న జయలలిత కుటుంబ సభ్యుల మధ్య రాకపోకలు తగ్గిపోయాయని లలిత అన్నారు. జయలిత తల్లిదండ్రులు జయరామ్, సంధ్య మరణించిన తరువాత జయతో పూర్తిగా సంబంధాలు తెగిపోయాయని లలిత గుర్తు చేశారు.

మా పెద్దమ్మ వెళ్లారు
1980లో జయలలిత గర్బవతి అని తెలుసుకున్న మా పెద్దమ్మ (ఆమె పేరు చెప్పడానికి లలిత నిరాకరించారు) తల్లిలేని పిల్ల అని మానవత్వంతో తమిళనాడు వెళ్లి జయలలితకు అండగా ఉన్నారని చెప్పారు. తరువాత జయలలితకు మా పెద్దమ్మ రహస్యంగా కాన్పు చేయించారని లలిత చెప్పారు.

జయలలితకు కూతురు ఉంది !
జయలలితకు కుమార్తె పుట్టారని, ఆ సందర్బంలో ఆ విషయం ఎవ్వరికీ చెప్పకూడదని జయ మా పెద్దమ్మ దగ్గర మాట తీసుకున్నారని, ఈ విషయం మా పెద్దమ్మ మాకు స్వయంగా చెప్పారని లలిత వివరించారు. అనంతరం బెంగళూరులో ఉన్న జయలలిత సోదరి (పెద్దమ్మ కుమార్తె) శైలజ ఓ అమ్మాయిని పెంచుకుంటున్నారని మాకు తెలిసిందని లలిత చెప్పారు.

జయ కుమార్తె అమృత అని చెప్పలేను !
జయలలిత సోదరి శైలజ దగ్గర పెరిగిన అమ్మాయి ఈ అమృత అని లలిత గుర్తు చేశారు. అయితే జయలలితకు పుట్టిన బిడ్డ అమృత అని తాను కచ్చితంగా చెప్పలేనని, డీఎన్ఏ పరీక్షలు నిర్వహిస్తే వాస్తవాలు వెలుగు చూస్తాయని లలిత వివరించారు.

మూడు నెలల క్రితం !
మూడు నెలల క్రితం తనను అమృత కలిసిందని, ఆ సందర్బంలో తాము గతం గుర్తు చేసుకున్నామని లలిత వివరించారు. జయలలితకు కచ్చితంగా అమ్మాయి పుట్టిందని లలిత కుండబద్దలు కొట్టి చెప్పడంతో ఇప్పుడు అమ్మ అభిమానులు అయోమయంలో పడిపోయారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications