జయ డిశ్చార్జి మా పరిధిలో లేదు, తెలుస్తోంది: ప్రతాప్ సి రెడ్డి

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు పరిసరాలు తెలుస్తున్నాయని, ఏం జరుగుతోందో ఆమెకు అర్థమవుతోందని అపోలో హాస్పిటల్స్ చైర్మన్ ప్రతాప్ సి. రెడ్డి అన్నారు. జయలలిత పూర్తిగా కోలుకున్నారని ఆయన శుక్రవారం మీడియాతో చెప్పారు.

Jayalalithaa has completely recovered: Pratap C Reddy

వైద్యంపై ఆపోలో హాస్పిటల్స్ పాఠ్యపుస్తకం విడుదల సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. జయలలిత ఆరోగ్యం చాలా వరకు మెరుగైందని, ఆమెను క్రిటికల్ కేర్ యూనిట్ (సిసియూ) నుమచి మరో మూడు రోజుల్లో ప్రైవేట్ గదికి మారుస్తారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

డిశ్చార్జి అంశం తమ పరిధిలో లేదని ఆయన చెప్పారు. తనకు అందిస్తున్న వైద్యం పట్ల జయలలిత సంతృప్తితో ఉన్నారని ఆయన చెప్పారు. మరి కొద్ది రోజుల్లో ఆమెను సాధారణ వార్డుకు మారుస్తామని కూడా ఆయన చెప్పారు.

పరిసరాలు ఆమెకు అవగాహనలోకి వస్తున్నాయని, తన చుట్టూ ఏం జరుగుతోందో ఆమెకు అర్థమవుతోందని, ఆమె పూర్తిగా కోలుకున్నారని ప్రతాప్ సి. రెడ్డి చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+