జయలలితకోసం ఆత్మహత్యకి యత్నించిన కోలీవుడ్ నటి

Jayalalithaa in jail: Actress attempts suicide at Chennai police commissioner's office
చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలితను జైలు నుండి విడుదల చేయలంటూ ఓ నటి ఆత్మహత్యకు ప్రయత్నించింది. కోలీవుడ్ నటి మాయా బుధవారం చెన్నై సిటీ పోలీసు కమిషనర్ కార్యాలయం ఎదుట ఆత్మహత్యకు ప్రయత్నించారు.

నటి మాయా, ఆమె కూతురు గుణప్రియలు బుధవారం ఉదయం వెపరేలోని పోలీసు కమిషనర్ కార్యాలయానికి వచ్చారు. అక్కడికి వారు తమతో కిరోసిన్ డబ్బాను తెచ్చుకున్నారు. మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు వారు కమిషనర్ కార్యాలయానికి వచ్చారు.

మాయా తనతో పాటు తెచ్చుకున్ కిరోసిన్‌ను ఒంటి పైన పోసుకునేందుకు ప్రయత్నించింది. దీనిని గుర్తించిన పోలీసులు ఆమెను నిలువరించారు. అనంతరం మాయాను పోలీసులు తమ కస్టడీకి తీసుకున్నారు. ఆమెను విచారించారు.

జయలలితకు మద్దతుగా తాను, తన కూతురు గుణప్రియలు ఆత్మహత్య చేసుకోవాలని భావించామని మాయా పోలీసుల విచారణలో వెల్లడించింది. కాగా, మాయా ఎంజీఆర్ హీరోగా వచ్చిన అమరకావ్యం, రజనీకాంత్ హీరోగా వచ్చిన గర్జనయ్ తదితర చిత్రాల్లో నటించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+