అమ్మ వారసుడు అజిత్ కారా: మూడు ముక్కలాట?

ప్రముఖ సినీ నటుడు అజిత్‌ను జయలలిత తన వారసుడిగా ప్రకటించిన దాఖలు ఏవీ లేవు. అయితే అతన్ని ఆమె తన కన్న కుమారుడిలా చూసుకున్నారు. ఈ స్థితిలో అన్నాడియంకె భవిష్యత్తు ఏమిటనేది ప్రశ్నార్థకంగా మారింది.

చెన్నై: జయలలిత మరణం తర్వాత ఆమె వారసులు ఎవరనే చర్చ సాగుతోంది. జయలలిత పార్టీని గాలికి వదిలేసి వెళ్లారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. తాను పోయిన తర్వాత ఏది ఏమైతే నాకేమిటి అనే పద్దతిలో ఆమె వ్యవహరించారా అనేది కూడా ప్రశ్నగానే మిగిలింది.

ఎంజి రామచంద్రన్ కూడా జయలలితను తన వారసురాలిగా ప్రకటించలేదు. కానీ, ఆమె తన ధైర్య సాహసాలతో, మొండిపట్టుతో ఆ స్థానాన్ని పోరాటం ద్వారా దాన్ని సాధించుకున్నారు. ఎంజిఆర్ భార్య జానకీ రామచంద్రన్ ఆయన వారసుడిగా ముందుకు రావడానికి చేసిన ప్రయత్నం ఫలించలేదు.

కానీ ఇప్పుడు అన్నాడియంకెలో అంతర్గత పోరాటం తప్పేలా లేదనిపిస్తోంది. అజిత్ నిజంగానే రాజకీయాల్లోకి వస్తారా లేదా అనేది కూడా తేలడం లేదు. శశికళ, ఆమె భర్త నటరాజన్ మాత్రం పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వాధినేతగా మాత్రం పన్నీర్ సెల్వం ఉన్నారు.

జయలలిత అజిత్ పేరు చెప్పారా...

జయలలిత అజిత్ పేరు చెప్పారా...

జయలలిత అపోలో ఆస్పత్రిలో పొందుతున్న సమయంలో తన వారసుడిగా సినీనటుడు అజిత్‌ను ప్రకటించారని ప్రచారం సాగుతోంది. వార్తలు కూడా వస్తున్నాయి. అయితే ఆ వార్తల్లో నిజం లేదని అంటున్నారు. ఇప్పటివరకూ జయ అలాంటి ప్రకటన ఎప్పుడో చేయలేదని తెలుస్తోంది. ఆమె అజిత్‌ను వ్యక్తిగతంగా కన్నకొడుకు కంటే ఎక్కువగా చూసుకునే వారని, పార్టీపరమైన వ్యవహారాలను అజిత్‌తో ఎప్పుడూ చర్చించలేదని ఆమె సన్నిహితులు అంటున్నారు. ఇదిలా ఉంటే, అజిత్ వచ్చే ఎన్నికల్లో అన్నాడీఎంకే పగ్గాలు పుచ్చుకుంటే బాగుంటుందని చాలామంది భావిస్తున్నారు.

అజిత్ వివాహానికి జయ..

అజిత్ వివాహానికి జయ..

అజిత్, షాలిని వివాహానికి జయలలిత హాజరై వారిద్దరినీ ఆశీర్వదించారు. పెళ్లి జరిగిన కొన్నాళ్లకు ఓ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అజిత్ తన పెళ్లికి జయలలిత రావడం జీవితాంతం మర్చిపోలేని విషయమని చెప్పాడు. పెళ్లి జరిగిన కొద్దిరోజుల తర్వాత షాలిని, తాను కలిసి పోస్ గార్డెన్‌లోని అమ్మ ఇంటికి వెళ్లామని, ఆమె తమపై ఎంతో ప్రేమాభిమానాన్ని చూపించారని అజిత్ తెలిపాడు. సొంత కొడుకు కంటే ఎక్కుగా చూసుకున్నారని అజిత్ ఆ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ఈ మాటలే జయలలిత, అజిత్ మధ్య ఉన్న సన్నిహిత సంబంధాన్ని తెలియజేస్తోంది.

పావులు కదుపుతున్న శశికళ భర్త...

పావులు కదుపుతున్న శశికళ భర్త...

శశికళ భర్త ఎం.నటరాజన్ మళ్లీ పోయెస్‌ గార్డెనలోకి, అన్నాడీఎంకేలోకి ప్రవేశించే అవకాశాలు కనిపిస్తున్నాి. ఐఆర్‌ఎస్‌ అధికారి అయిన నటరాజన్ శశికళ జయకు సన్నిహితంగా మారాక ప్రభుత్వంలో, పార్టీ కార్యక్రమాల్లో జోక్యం చేసుకునేవారు. అయితే ఆయన వ్యవహారశైలి నచ్చకపోవడంతో నటరాజన్‌ను జయ దూరంగా పెట్టారు. పోయెస్‌ గార్డెనలో సైతం ఆయనకు ప్రవేశం లేకుండాపోయింది. జయ మరణించడంతో సోమవారం ఆయన పోయెస్‌గార్డెన్‌కు వచ్చారు. మంగళవారం రాజాజీ హాలులో జయకు అంజలి ఘటించడంతోపాటు అంత్యక్రియలకూ హాజరయ్యారు.

జయ ప్రియసఖి శశికళ ఏం చేస్తారు...

జయ ప్రియసఖి శశికళ ఏం చేస్తారు...

జయలలిత ప్రియసఖి పార్టీ పగ్గాలు చేతుల్లోకి తీసుకుంటారనే ప్రచారం సాగుతోంది. అన్నాడియంకె ప్రధాన కార్యదర్శిగా ప్రభుత్వ, పార్టీ కార్యకలాపాలను ఆమె నిర్దేశిస్తారని అంటున్నారు. మంత్రులు, పార్టీ నాయకుల సమావేశాలకు ఆమెనే నేతృత్వం వహిస్తున్నట్లు కూడా చెబుతున్నారు. శశికళ అంత్యక్రియల్లో అంతిమ సంస్కారాలను కూడా ఆమెనే నిర్వహించారు. దీంతో జయలలిత వారసురాలిగా రావడానికి ఆమె ప్రయత్నాలు ప్రారంభించవచ్చునని అంటున్నారు.

ఆయన చూస్తూ ఉంటారా...

ఆయన చూస్తూ ఉంటారా...

జయలలితకు నమ్మిన బంటుగా ఉంటూ వచ్చిన పన్నీరు సెల్వం ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. అయితే, దానికి ముందు అంతర్గత రాజకీయం పెద్ద యెత్తునే జరిగిందని అంటున్నారు. బిజెపి జోక్యం చేసుకుని ఆయనను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టిందని అంటున్నారు. జయలలిత గతంలో రెండుసార్లు తన స్థానంలో ఆయనకు అవకాశం ఇవ్వడం వల్ల ఆమె మరణం తర్వాత ఆయన ముఖ్యమంత్రి కావడంపై పెద్దగా వ్యతిరేకత ఎదురు కాలేదు. కానీ భవిష్యత్తులో ఆయన జయలలిత వారసుడిగా నిలబడుతారని చెప్పే వాతావరణం మాత్రం లేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+