జయలలిత ఆరోగ్యం, కార్యకర్తల ఆందోళన: ఆసుపత్రికి 24మంది మంత్రులు
చెన్నై: అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్య పరిస్థితి పైన సస్పెన్స్ కొనసాగుతోంది. చెన్నై అపోలో ఆసుపత్రి వద్ద భారీ బందోబస్తు ఉంది. ఆసుపత్రికి 24 మంది మంత్రులు, ఎనిమిది మంది సీనియర్ ఐఏఎస్‌లు వచ్చారు. దీంతో ఏం జరుగుతుందో ఎవరికీ ఏం అర్థం కావడం లేదు.

ఆమె పదకొండు రోజులుగా అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న విషయం తెలిసిందే. ఆమె ఆరోగ్యం కుదుటపడుతోందని వైద్యులు చెబుతున్నారు. అమ్మ ఆరోగ్యం త్వరగా కుదుటపడాలని అభిమానులు, అన్నాడీఎంకే కార్యకర్తలు పూజలు చేస్తున్నారు. హెల్త్ బులెటిన్ విడుదల చేయాలని కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు.
అపోలో ప్రధాన గేటు వద్ద ఉద్రిక్తత
అపోలో ఆసుపత్రి దగ్గర ఆదివారం నాడు స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. అమ్మ ఆరోగ్యం గురించి చెప్పాలని అభిమానులు గేటు బయట బైఠాయించారు. పలువురు గేటు వద్దే పూజలు చేస్తున్నారు. హెల్త్ బులెటిన్ విడుదల చేయాలని కోరుతున్నారు. గేటు వద్ద బారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.












Click it and Unblock the Notifications