సంచలనం: జయలలిత తండ్రిని చంపింది ఆమె తల్లే?, వెలుగులోకి మరో కథనం..

Subscribe to Oneindia Telugu

తమిళనాడు దివంగత సీఎం జయలలిత మరణం తర్వాత ఆమె వ్యక్తిగత జీవితం, కుటుంబ జీవితంపై తీవ్ర చర్చ జరుగుతూ వస్తోంది. జయ అంతరంగీక జీవితం గురించి ఎరిగినవాళ్లు అతికొద్దిమందే కావడం గమనార్హం.

జయ మృతి నేపథ్యంలో ఆమె అసలు వారసులెవరు? అన్న దానిపై అటు రాజకీయంగా.. ఇటు బయోలాజికల్‌గా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. జయలలిత కుమార్తెగా అమృత అనే యువతి న్యాయపోరాటానికి దిగిన తరుణంలో.. జయ కుటుంబానికి సంబంధించి మరో సంచలన వార్త వెలుగులోకి వచ్చింది.

తల్లే చంపేశారు

తల్లే చంపేశారు

జయలలిత తండ్రి జయరామన్‌ మద్యానికి బానిస కావటంతో కుటుంబానికి దూరంగా ఉంచారని, అతనికి తల్లి సంధ్యే విషమిచ్చి చంపిందని జయ బంధువు లలిత ఆరోపించారు. జయలలిత చిన్నతనంలోనే ఆమె తండ్రి చనిపోయారన్న కథనం మాత్రమే ఇప్పటిదాకా ప్రచారంలో ఉంది. తాజాగా లలిత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి.

అందుకే దూరం పెట్టేశాం

అందుకే దూరం పెట్టేశాం

జయలలిత ఈగోను, జయరామన్ హత్యను భరించలేకే ఆ కుటుంబానికి తామంతా దూరంగా ఉన్నామని లలిత చెప్పారు. కాగా, జయలలిత తండ్రి జయరామన్, సంధ్య దంపతులకు జయలలిత, జయకుమార్‌ సంతానం. స్వతహాగా సినీ నటి అయిన సంధ్య జయలలితను సైతం సినిమాల్లోకి తీసుకొచ్చారు. అయితే తన సినీ ఎంట్రీ అయిష్టంగానే సాగిందని జయలలిత పలుమార్లు చెప్పారు.

ఒట్టేయించుకున్నారు

ఒట్టేయించుకున్నారు

జయలలిత ఒక ఆడశిశువు జన్మించిన మాట వాస్తవమేనని లలిత అన్నారు. తన పెద్దమ్మే ఆమెకు పురుడుపోసిందని చెప్పారు. ఈ విషయం ఎవరికీ చెప్పవద్దని జయలలిత తమతో ప్రమాణం చేయించుకున్నారని కూడా చెప్పారు. ఇటీవల తమిళ చానల్‌ సన్‌న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో లలిత ఈ విషయాలు వెల్లడించారు.

అజ్ఞాతంలోకి అమృత

అజ్ఞాతంలోకి అమృత

జయలలిత కడుపున పుట్టిన బిడ్డగా న్యాయపోరాటానికి సిద్దమైన అమృత ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే కర్ణాటక హైకోర్టును ఆశ్రయించే పనిలో నిమగ్నమైందునవల్లే ఆమె అజ్ఞాతంలోకి వెళ్లి ఉంటారని భావిస్తున్నారు. డీఎన్ఏ టెస్టు జరపాలంటూ సుప్రీం కోర్టులో ఆమె వేసిన పిటిషన్ తోసిపుచ్చడంతో.. ఇప్పుడామె కర్ణాటక హైకోర్టును ఆశ్రయిస్తున్న సంగతి తెలిసిందే.

రహస్యంగా వ్యక్తిగత జీవితం

జయలలిత ఉన్నన్ని రోజులు ఆమె వ్యక్తిగత జీవితం గురించి ప్రస్తావించడానికి కూడా ఎవరూ సాహసించలేదు. కానీ ఆమె మరణం తర్వాత నిజాలన్ని ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి.

ఈ క్రమంలోనే శోభన్‌బాబు-జయలలితల వ్యక్తిగత జీవితం కూడా వెలుగులోకి వచ్చింది. జయలలిత నెచ్చెలిగా శశికళకు మాత్రమే అమ్మ జీవితం గురించిన అంతరంగీక విషయాలు తెలుసన్న వాదన ఉంది. కానీ శశికళ కూడా జయలలిత వ్యక్తిగత జీవితంపై నోరు విప్పే అవకాశం లేకపోవడంతో చాలా విషయాలు బయటపడే అవకాశాలు కనిపించడం లేదు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Jayalalithaa's relative Lalitha made sensational comments on Jaya's father death. She alleged Jaya's mother killed him.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి