షాక్.. శశికళ తమిళనాడు సీఎం: జయలలిత మేనళ్లుడు దీపక్

జయలలిత మేనళ్లుడు దీపక్ మీడియాతో మాట్లాడుతూ తమిళనాడు ముఖ్యమంత్రిగా శశికళ ఆంటీ బాధ్యతలు స్వీకరిస్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు. శశికళ అన్నాడీఎంకే పార్టీ బాధ్యతలు స్వీకరించి మా మేనత్త జయలలిత ఆశయాలు నెరవే

చెన్నై: అన్నాడీఎంకే పార్టీలో ఇంత కాలం శశికళ అనుచరులు చిన్నమ్మ సీఎం కావాలని నినాదాలు చేస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు ఇంకో అడుగు ముందుకు వేసి జయలలిత కుటుంబ సభ్యుల దగ్గర శశికళ సీఎం కావాలని చెప్పిస్తున్నారు.

జయలలిత సోదరుడు జయకుమార్ కుమారుడు దీపక్ శశికళతో సన్నిహితంగా ఉన్న విషయం తెలిసిందే. మంగళవారం మీడియాతో మాట్లాడిన దీపక్ తమిళనాడు ముఖ్యమంత్రిగా శశికళ ఆంటీ బాధ్యతలు స్వీకరిస్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Jayalalithaa's nephew Deepak Jayakumar says, Sasikala will become CM of Tamil Nadu.

శశికళ అన్నాడీఎంకే పార్టీ బాధ్యతలు స్వీకరించి మా మేనత్త జయలలిత ఆశయాలు నెరవేర్చడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పారు. అదే విధంగా తమిళనాడు ముఖ్యమంత్రిగా శశికళ ఉండాలని అన్నాడీఎంకే పార్టీ నాయకులతో పాటు తాను కొరుకుంటున్నానని అన్నారు.

అన్నాడీఎంకే పార్టీ పగ్గాలు శశికళకు అప్పగించరాదని, సీఎంకుర్చిలో కుర్చోపెట్టరాదని జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. అన్నాడీఎంకే కార్యకర్తలు సైతం శశికళకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నారు.

ఇదే సమయంలో జయలలిత మేనళ్లుడు దీపక్ ను రంగంలోకి దించిన శశికళ అనుచరులు వారికి అనుకూలంగా ప్రకటనలు చేయించుకుంటున్నారు. దీపక్ మాటలను పెద్దగా పట్టించుకోనవసరం లేదని శశికళను వ్యతిరేకిస్తున్న నాయకులు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+