ట్విస్ట్: దీపతో శశికళ వ్యూహాలకు పన్నీరు చెక్! 'ముఖ్యమంత్రి'పై స్టాలిన్

తమిళనాడు రాజకీయాల్లో మరో ట్విస్ట్. అన్నాడీఎంకే అధినేత్రి శశికళ ముఖ్యమంత్రి పీఠం ఆశల పైన సీఎం పన్నీరు సెల్వం నీళ్లు జల్లుతున్నారు. శశికళ పావులకు ఆయన చెక్ చెప్పే వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు.

చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో మరో ట్విస్ట్. అన్నాడీఎంకే అధినేత్రి శశికళ ముఖ్యమంత్రి పీఠం ఆశల పైన సీఎం పన్నీరు సెల్వం నీళ్లు జల్లుతున్నారు. శశికళ పావులకు ఆయన చెక్ చెప్పే వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు.

ముఖ్యమంత్రి పదవి నుంచి దిగేందుకు పన్నీరు సెల్వం ససేమీరా అంటున్నారు. అంతేకాదు, శశికళ పైన ఉద్యమిస్తున్న.. జయలలిత కోడలు దీపా జయకుమార్ మద్దతును పన్నీరు తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. పరిస్థితులు చూస్తుంటే అన్నాడీఎంకే చీలిక దిశగా సాగుతోందని అంటున్నారు.

sasikala

కాగా, గత రెండు రోజులుగా అన్నాడీఎంకేలో పరిణామాల వేగంగా మారుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షీలా బాలకృష్ణన్‌ అకస్మాత్తుగా రాజీనామా చేశారు. మరో ఇద్దరు ముఖ్యమంత్రి కార్యాలయం కార్యదర్శులు కూడా శుక్రవారం రాత్రి రాజీనామా లేఖలు సమర్పించారు.

ముగ్గురి రాజీనామాలను తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఆమోదించారు. ఆదివారం మధ్యాహ్నం అన్నా డీఎంకే శాసనసభా సమావేశం జరగనుంది. ఎమ్మెల్యేల సమావేశం తర్వాత కొన్ని కీలక నిర్ణయాలు ఉండవచ్చని అన్నా డీఎంకే అధికార ప్రతినిధి పార్టీ శ్రేణులకు సంకేతాలిచ్చారు.

ప్రభుత్వ సలహాదారు ఆకస్మిక రాజీనామపై డీఎంకే నేత స్టాలిన్‌ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పన్నీరు సెల్వంను ముఖ్యమంత్రి పదవి పీఠం నుంచి తొలగించాలని అన్నాడీఎంకే చూస్తోందని స్టాలిన్ అన్నారు.

ఆదివారం జరిగే అన్నాడీఎంకే శాసనసభాపక్ష సమావేశంలో ముఖ్యమంత్రిగా శశికళను ఎన్నుకుంటారే ప్రచారం సాగింది. అందుకే సీఎం కార్యాలయ అధికారులతో రాజీనామా చేయిస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి.

అన్నాడీఎంకేలో అంతర్గత కలహాలు నెలకొన్నాయని భావిస్తున్న నేపథ్యంలో పార్టీ ప్రక్షాళన దిశగా ప్రధాన కార్యదర్శి శశికళ చర్యలు చేపట్టారు. అంతకుముందు, 23మంది సీనియర్‌ నేతలను పార్టీ పదవుల్లో నియమించారు. తాజా పరిణామాలపై తమిళనాడు రాజకీయాల్లో చర్చ జరుగుతోంది. ఈ రోజు మధ్యాహ్నం జరగబోయే అన్నాడీఎంకే శాసనసభాపక్ష సమావేశంపైనే అందరి దృష్టి కేంద్రీకృతమైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+