చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అభినందన: మోడీ, చంద్రబాబుకు జయలలిత ధన్యవాదాలు

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

చెన్నై: ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడులకు తమిళనాడు సీఎం జయలలిత ధన్యవాదాలు తెలిపారు. ఐదోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తనకు అభినందనలు తెలిపినందుకు ధన్యవాదాలు చెప్పారు. ఈ మేరకు ఆదివారం లెటర్లను విడుదల చేశారు.

శనివారం సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన జయలలితకు ప్రధాని మోడీ ట్విటర్లో అభినందలు తెలిపిన సంగతి తెలిసిందే.

జయలలిత ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కేంద్ర అరుణ్‌ జైట్లీ రావాల్సి ఉన్నా ఆయన గైర్హాజరయ్యారు. ఆమె ప్రమాణ స్వీకారం కాగానే శుభాకాంక్షల సందేశాన్ని పంపారు. జయ ప్రభుత్వానికి కేంద్రం అన్ని విధాలా మద్దతిస్తుందని, తమిళనాడుతో కేంద్రం సత్సంబంధాలు కోరుకుంటోందని చెప్పారు.

ఇక ఏపీ సీఎం చంద్రబాబు కూడా జయలలితకు ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. అలాగే కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు కూడా సెల్‌ఫోన్‌ ద్వారా జయలలితకు శుభాకాంక్షలు తెలిపారు. శనివారం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జయలలిత ఆదివారం విధులకు హాజరయ్యారు.

Jayalalithaa thanks Modi for wishes

మధ్యాహ్నం మూడు గంటలకు జయలలిత సెక్రటేరియట్‌కు వచ్చారు. సెక్రటేరియట్‌ సిబ్బంది ఆదివారమైన విధులకు హాజరయ్యారు. తమిళనాడులో మరిన్ని అమ్మ క్యాంటిన్‌లను జయలలిత ప్రారంభించనున్నారు. గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమావేశం, చెన్నై మెట్రో ప్రాజెక్టును ఆమె ప్రారంభిస్తారు.

English summary
Tamil Nadu Chief Minister Jayalalithaa on Sunday thanked Prime Minister Narendra Modi, Union Finance Minister Arun Jaitley and her Andhra Pradesh counterpart Chandrababu Naidu for their greetings on her assuming office for the fifth time.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X