వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆయనకు వయస్సు అయిపోయింది, ఆమెకు అనారోగ్యం (పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడు రాజకీయాలు చాల విలక్షణమైనవి, ఆసక్తికరమైనవి. దేశంలో తమిళనాడు రాజకీయాల మీద ఏదో ఒక చర్చ జరుగుతూనే ఉంటుంది. దానికి తోడుగా తమిళ పరిపాలనా పీఠంపై సినిమా ప్రభావం ఎప్పుడూ ఉంటుంది. ప్రస్తుతం ఇప్పుడు పరిస్థితి అలాగే ఉంది.

తమిళనాడు సీఎం కుర్చిపై కన్ను వేసి బరిలో దిగిన మూడు పార్టీల నేతలకు సినిమా నేపథ్యం పుష్కలంగా ఉంది. సినీ నేపథ్యం నుంచి వచ్చిన డీఎంకే, అన్నా డీఎంకే నేతలు ముఖ్యమంత్రులు అయ్యి గత 50 సంవత్సరాలుగా తమిళనాడు రాష్ట్రాన్నిఏలుతున్నారు.

దానికి తోడుగా ఇప్పుడు కెప్టెన్ విజయ్ కాంత్ రంగంలోకి దిగారు. ఈ సారి మాత్రం సినీ గ్లామర్ ను అధికమిస్తానని పట్టాలి మక్కల్ కచ్చి (పీఎంకే) అభ్యర్థి అన్భుమణి రామదాస్ అంటున్నారు. ఈ సారి తాము అధికారంలోకి వస్తామని అన్భుమణి రామదాస్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఆయనకు వయస్సు అయిపోయింది, ఆమెకు అనారోగ్యం

ఆయనకు వయస్సు అయిపోయింది, ఆమెకు అనారోగ్యం

పార్టీ పరంగా కొన్ని బలహీనతలు ఉన్నా డీఎంకే, అన్నా డీఎంకే కంచుకోటలు బద్దలు కొడతానని రామదాస్ అంటున్నారు.

అన్భుమణి రామదాస్ డాక్టర్.

అన్భుమణి రామదాస్ డాక్టర్.

టెక్ శావీ అయిన అన్భుమణి రామదాస్ ప్రచారంలో దూసుకు వెలుతున్నారు. పీఎంకేకు కులవాదం ముద్రపడిపోయింది.

 ఆయనకు వయస్సు అయిపోయింది, ఆమెకు అనారోగ్యం

ఆయనకు వయస్సు అయిపోయింది, ఆమెకు అనారోగ్యం

అయితే తాను పీఎంకేని ప్రజలందరికి చేరువ చేస్తానని, మంచి పరిపాలన కోసం యువతకు తాను తప్ప ఇక్కడ మరో ప్రత్యామ్నాయం లేదని ఆయన అంటున్నారు.

ఆయనకు వయస్సు అయిపోయింది, ఆమెకు అనారోగ్యం

ఆయనకు వయస్సు అయిపోయింది, ఆమెకు అనారోగ్యం

ప్రస్తుతం తమిళనాడు ముఖ్యమంత్రి అభ్యర్థుల బరిలో ఉన్న కుమారి జయలలిత, కరుణా నిధి, విజయ్ కాంత్ ల గురించి ఇటీవల ఆయన ఓ ఇంటర్వూలో ఈ విధంగా వ్యాఖ్యలు చేశారు.

 ఆయనకు వయస్సు అయిపోయింది, ఆమెకు అనారోగ్యం

ఆయనకు వయస్సు అయిపోయింది, ఆమెకు అనారోగ్యం

ముఖ్యమంత్రి అభ్యర్థులుగా బరిలో ఉన్న ముగ్గురిని తాను గౌరవిస్తానని రామదాస్ చెప్పారు. కానీ వారు తమ కార్యకలాపాలు సొంతంగా చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారని ఎద్దేవ చేశారు.

ఆయనకు వయస్సు అయిపోయింది, ఆమెకు అనారోగ్యం

ఆయనకు వయస్సు అయిపోయింది, ఆమెకు అనారోగ్యం

గత ఐదు సంవత్సరాలుగా ఇప్పటి ముఖ్యమంత్రి జయలలిత తన ఇంటి నుంచి కాలు బయటపెట్టలేదని ఆరోపించారు.

 ఆయనకు వయస్సు అయిపోయింది, ఆమెకు అనారోగ్యం

ఆయనకు వయస్సు అయిపోయింది, ఆమెకు అనారోగ్యం

ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారని అన్నారు. 93 సంవత్సరాలు ఉన్న కరుణానిధి సైతం ముఖ్యమంత్రి పదవి బరిలో ఉండటం విడ్డూరంగా ఉందన్నారు.

ఆయన కాలు కదపలేరని చెప్పారు.

ఆయన కాలు కదపలేరని చెప్పారు.

కరుణానిధి రిటైర్ అయితే మంచిదని సూచించారు. ఈ వ్యాఖ్యలు డీఎంకేకి చెందిన నాయకులే అంటున్నారని అన్నారు.

 ఆయనకు వయస్సు అయిపోయింది, ఆమెకు అనారోగ్యం

ఆయనకు వయస్సు అయిపోయింది, ఆమెకు అనారోగ్యం

ఇక కెప్టెన్ విజయ్ కాంత్ గురించి తనదైన శైలిలో స్పందించారు. విజయ్ కాంత్ ప్రజలు చెప్పేది వినడు. ఆయన చెప్పేది ప్రజలకు అర్థం కాదు. విజయ్ కాంత్ కు పొందిక లేదు అని విమర్శించారు.

ఆయనకు వయస్సు అయిపోయింది, ఆమెకు అనారోగ్యం

ఆయనకు వయస్సు అయిపోయింది, ఆమెకు అనారోగ్యం

ఈ నేపథ్యంలో డాక్టర్ అయిన నా పట్ల ప్రజలకు నమ్మకం ఉంది. ఇప్పటికే కేంద్ర మంత్రిగా నా సత్తా చాటానని అంటున్నారు.

 ఆయనకు వయస్సు అయిపోయింది, ఆమెకు అనారోగ్యం

ఆయనకు వయస్సు అయిపోయింది, ఆమెకు అనారోగ్యం

తమిళనాడు రాష్ర్టంలోని 2.5 కోట్ల మంది యువ ఓటర్లకు నేను ఉత్తమ ప్రత్యామ్నాయాన్ని, వారి ఆకాంక్షలు నిలబెట్టే విధంగా పని చేస్తానన్నారు.

ఆయనకు వయస్సు అయిపోయింది, ఆమెకు అనారోగ్యం

ఆయనకు వయస్సు అయిపోయింది, ఆమెకు అనారోగ్యం

ఈ ఎన్నికల్లో తమిళ ప్రజల మన్నన పొందుతాను అని అన్భుమణి రామదాస్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఒంటరిగా పోటీ చేస్తున్న పీఎంకే ఎన్ని స్థానాల్లో విజయం సాధిస్తుంది అని వేచి చూడాలి.

English summary
For five years we had a CM who could not step out of her house (as much as she should have because of health reasons), we have a 93-year-old leader (M Karunanidhi) whose own party leaders are asking him to retire.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X