జయప్రదపై రాయి విసిరాడు, ఆమెపై ఉల్లంఘన కేసు
లక్నో: నిన్నటి తరం కథానాయిక, రాష్ట్రీయ లోకదళ్ లోకసభ అభ్యర్థి జయప్రద పైన ఓ గుర్తు తెలియని వ్యక్తి రాయితో దాడి చేశాడు. జయప్రద రాష్ట్రీయ లోకదళ్ పార్టీ తరఫున ఉత్తర ప్రదేశ్‌లోని బిజ్నోర్ లోకసభ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.
ఆమె మంగళవారం తన నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్న సమయంలో ఓ వ్యక్తి ఆమె కారు పైన హఠాత్తుగా రాయి విసిరాడు. అతను రాయి విసిరిన సమయంలో ఆమె కారులోనే ఉన్నారు. దీంతో ఆమెకు ఎలాంటి గాయం కాలేదు.
రాయి విసిరిన వ్యక్తి అక్కడి నుండి పరారయ్యాడు. ఈ ఘటనపై జయప్రద పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు జయప్రదకు సెక్యూరిటీ పెంచాలని చూస్తున్నారు.

జయప్రద
మరోవైపు జయప్రద పైన ఎన్నికల నియమావళి ఉల్లంఘన కేసు నమోదయింది. జయప్రదతో పాటు ఆర్ఎల్డీ జిల్లా అధ్యక్షుడు అజిత్ రాఠీ పైన కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.

జయప్రద
బిజ్నోర్ లోకసభకు నుండి రాష్ట్రీయ లోక దళ్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న జయప్రద, అజిత్ రాఠీ మంగళవారం సాయంత్రం అనుమతి తీసుకోకుండానే బహిరంగ సభను ఏర్పాటు చేశారు.

జయప్రద
అలాగే ప్రభుత్వ భవనాల పైన పార్టీల జెండాలు ఏర్పాటు చేశారనే ఆరోపణలతో మరికొంతమంది బిజెపి, కాంగ్రెసు పార్టీ నేతల పైన కూడా ఎన్నికల నియమావళి ుల్లంఘన కేసులు నమోదయ్యాయి.

జయప్రద
నిన్నటి తరం కథానాయిక, రాష్ట్రీయ లోకదళ్ లోకసభ అభ్యర్థి జయప్రద పైన ఓ గుర్తు తెలియని వ్యక్తి రాయితో దాడి చేశాడు. జయప్రద రాష్ట్రీయ లోకదళ్ పార్టీ తరఫున ఉత్తర ప్రదేశ్‌లోని బిజ్నోర్ లోకసభ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications