పవన్ కళ్యాణ్ రాజకీయ నేత కారు: జయప్రద వ్యాఖ్య
హైదరాబాద్: రాష్ట్రీయ లోకదళ్ బిజ్నోర్ అభ్యర్థి, సినీ నటి జయప్రద జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై తీవ్రంగా మండిపడ్డారు. జగన్‌కు అనుకూలంగా వ్యాఖ్యలు చేశారు సాక్షి మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ రాజకీయ నాయకుడు కారని, పార్టీ పెట్టి నరేంద్ర మోడీకి ఎందుకు మద్దతు ఇచ్చారో అర్థం కావడం లేదని జయప్రద అన్నారు.
సినీ తారల సభలకు పెద్ద యెత్తన జనం వస్తారని, అంత మాత్రాన వారు చెప్పినవారికే ఓటేస్తారనే నమ్మకం లేదని, , మనం ఎంతో మంది మహామహులైన సినీతారుల ఎలా దెబ్బ తిన్నారో చూశామని, పవన్ కళ్యాణ్ భవిష్యత్తు రాజకీయం ఎలా ఉంటుందో చూడాలని ఆమె అన్నారు.

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు బిజెపితో పొత్తు పెట్టుకోవడం దారుణమని ఆమె వ్యాఖ్యానించారు. ఆ పార్టీ పొత్తు పెట్టుకోవడం అనేది తప్పు అని చంద్రబాబు గతంలో అన్నారని, అందుకు పశ్చాత్తాపపడ్డారని, ఇప్పుడు మళ్లీ పొత్తు పెట్టుకున్నారని ఆమె అన్నారు. చంద్రబాబు పశ్చాత్తాపానికి అర్థం లేదా, టిడిపికి ఒక విధానమంటూ లేదా అని ఆమె అడిగారు.
చంద్రబాబు నాయుడు రాష్ట్ర విభజనకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వానికి లేఖ ఇచ్చారని, తర్వాత అన్యాయంగా చీల్చారని చంద్రబాబే విమర్శిస్తున్నారని, రాష్ట్ర విభజన విషయంలో చంద్రబాబు ద్వంద్వ వైఖరి అవలంబించారని ఆమె విమర్శించారు.
ఈసారి ఆంధ్రప్రదేశ్ నుంచి పోటీ చేయాలని అనుకున్నానని, అయితే నిర్ణయం తీసుకోవడానికి సమయం సరిపోలేదని జయప్రద చెప్పారు.












Click it and Unblock the Notifications