బార్ గర్ల్‌తో ఎమ్మెల్యే చిందులు: బయటపడిన వీడియో
పాట్నా: బార్ గర్ల్‌తో డ్యాన్స్ చేస్తూ బీహార్ అధికార పార్టీ జెడి (యు) శాసనసభ్యుడు శ్యాం బహదూర్ సింగ్ బయటపడ్డాడు. బార్ గర్ల్‌తో డ్యాన్స్ చేస్తూ ఆయన కెమెరాకు చిక్కారు. బీహార్‌లోని సివాన్ జిల్లాలోని తన నియోజకవర్గం బర్హారియాలోని ఓ కార్యక్రమంలో ఎమ్మెల్యే బార్ గర్ల్‌తో నృత్యం చేస్తున్న వీడియోలు బయటకు రావడంతో జెడి(యు) చిక్కుల్లో పడింది.
బార్ గర్ల్‌తో అతను నృత్యం చేయడమే కాకుండా అసభ్యకరమైన చర్యలకు కూడా పాల్పడినట్లు జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. సింగ్ వివాదాలకు అతీతుడేమీ కారు. గోపాల్‌గంజ్ జిల్లాలోని ఓ వివాహం సందర్భంగా అమ్మాయిలతో డ్యాన్స్ చేస్తూ 2012లో ఆయన కెమెరాకు చిక్కారు.

అదే విధమైన సంఘటనలో 2010లో కూడా సింగ్ కెమెరాకు చిక్కాడు. అప్పుడు కూడా అతను అమ్మాయిలతో నృత్యం చేస్తూ కనిపించాడు. స్థానిక టీవీ చానెల్స్ అతను అమ్మాయిలతో డ్యాన్స్ చేస్తూ అసభ్యకరమైన చేష్టలకు పూనుకున్న దృశ్యాలను ప్రసారం చేశాయి. ఆ సమయంలో ఆయన క్షమాపణలు చెప్పారు.
ఆయనకు జెడి (యు) నాయకత్వం హెచ్చరికలు జారీ చేసింది. కానీ, ఆయన వాటిని పట్టించుకున్నట్లు కనిపించడం లేదు. ఇప్పుడు పార్టీ నాయకత్వంపై ఆయనపై ఏమైనా చర్యలు తీసుకుంటుందా అనేది చూడాల్సిందే.












Click it and Unblock the Notifications