నరేంద్ర మోడీ, రాహుల్ గాంధీ ప్రధాని కాలేరు: రేసులో డార్క్ హార్స్, ప్రకాష్ అంబేద్కర్ జోస్యం!
ముంబై: నరేంద్ర మోడీ, ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీలకు ప్రధాన మంత్రి అయ్యే చాన్స్ లేదని, తృతియ ఫ్రంట్ కు చెందిన సీనియర్ నేత ప్రధాని అవుతారని వీబీఏ ప్రధాన కార్యదర్శి ప్రకాష్ అంబేద్కర్ జోస్యం చెప్పారు. నరేంద్ర మోడీ మరోసారి ప్రధాని అయ్యే అవకాశం లేదని ప్రకాష్ అంబేద్కర్ అన్నారు.
ముంబైల్ మీడియాతో మాట్లాడిన ప్రకాష్ అంబేద్కర్ లోక్ సభ ఎన్నికలు పూర్తి అయిన తరువాత ఎవరు ప్రధాని అవుతారో అనే విషయంలో క్లారిటీ వస్తుందని చెప్పారు. లోక్ సభ ఎన్నికలు పూర్తి అయిన తరువాత మాజీ ప్రధాని హెచ్.డి. దేవేగౌడ డార్క్ హార్స్ లా తెర మీదకు వస్తారని ప్రకాష్ అంబేద్కర్ అన్నారు.

తన లెక్కప్రకారం అధికారంలోకి రావడానికి ఎవ్వరికీ పూర్తి మెజారిటీ రాదని ప్రకాష్ అంబేద్కర్ అన్నారు. తృతియ ఫ్రంట్ కు చెందిన సీనియర్ నేత ప్రధాని పదవికి ఎంపిక అవుతారని ప్రకాష్ అంబేద్కర్ వివరించారు. అయితే ప్రధాని ఎవరు అవుతారు అని ఇప్పుడే ఊహించడం కష్టమైన పని అన్నారు.
అయితే తన అంచనా ప్రకారం జేడీఎస్ చీఫ్ హెచ్.డి. దేవేగౌడ మళ్ళీ ప్రధాని అవుతారని ప్రకాష్ అంబేద్కర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. బీజేపీ, కాంగ్రెస్ ను వ్యతిరేకించే పార్టీలు అన్నీ ఏకం అవుతాయని, కేంద్రంలో అధికారంలోకి వస్తుందని ప్రకాష్ అంబేద్కర్ అన్నారు. కాంగ్రెస్ కు చెందిన మిత్రపక్షాలు రాహుల్ గాంధీని ప్రధానిని చెయ్యడానికి సిద్దంగా లేవని ప్రకాష్ అంబేద్కర్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
-
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..!












Click it and Unblock the Notifications