జేడీఎస్ లీడర్ అరాచకం: లేడీ హెచ్ఎంను బెల్ట్‌తో చావబాదాడు
బెంగళూరు: జేడీఎస్ నేత రామకృష్ణప్ప అరాచకానికి పాల్పడ్డాడు. కర్ణాటక రాజధాని బెంగళూరులోని ఓ ప్రైవేటు పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలిపై దాడి చేశాడు. అంతేగాక, బెల్టు తీసుకుని చావబాదాడు. కాగా, ఇదంతా పాఠశాలలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది.
సోమవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు వైరల్ అయ్యాయి. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. రామకృష్ణప్ప కుమారుడు జనార్ధన్‌ను అదుపులోకి తీసుకున్నారు. రామకృష్ణప్ప పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు.

ప్రైవేటు పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలిగా పనిచేస్తున్న బాధితురాలు ఆశ.. రామకృష్ణప్ప నుంచి రూ.70వేలు అప్పుగా తీసుకుందని పోలీసులు తెలిపారు. అయితే, అప్పుగా ఇచ్చిన రూ.70వేలకు వడ్డీ చెల్లించడం లేదని ఆమెపై నిందితుడు దాడికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications