మంచి అవకాశం ఇచ్చిన మోదీ, మాజీ ప్రధానికి లక్కీచాన్స్, లోక్ సభ ఎన్నికలకు ముందే ఇలా !

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కూటమిగా ఏర్పడిన బీజేపీ, జేడీఎస్‌ పార్టీల ఉమ్మడి అభ్యర్థిని రంగంలోకి దింపారు. బెంగళూరు ఉపాధ్యాయుల నియోజకవర్గ ఉప ఎన్నికలకు ఎన్ డీఏ కూటమి అభ్యర్థిగా జేడీఎస్ రాష్ట్ర న్యాయ విభాగం అధ్యక్షుడు ఏపి. రంగనాథ్‌ను బరిలోకి దింపింది. బెంగళూరులోని విధాన పరిషత్‌కు జరగనున్న ఉప ఎన్నికకు జేడీఎస్-బీజేపీ కూటమి ఎన్డీఏ అభ్యర్థి ఏపి. రంగనాథ్ నామినేషన్ వేశారు.

సోమవారం బెంగళూరు ఎన్నికల అధికారి, ప్రాంతీయ కమిషనర్ కార్యాలయంలో ఎన్ డీఏ అభ్యర్థి రంగనాథ్ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు హెచ్‌డీ కుమారస్వామి, బీజేపీ సీనియర్‌ నాయకులు, మాజీ ఉప ముఖ్యమంత్రి డాక్టర్‌ సీఎన్‌ అశ్వత్‌నారాయణ, జేడీఎస్ కోర్ కమిటీ అధ్యక్షుడు జీటీ దేవెగౌడ, విధాన పరిషత్‌ సభ్యుడు టీఏ శరవణ్‌, మాజీ సభ్యుడు చౌడరెడ్డి, జేడీఎస్‌ నగర విభాగం అధ్యక్షుడు హెచ్‌ఎం రమేష్‌గౌడ్‌ ఎన్డీఏ కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి రంగనాథ్ వెంట ఉన్నారు.

JDS leader Ranganath nominated as NDA candidate for Bengaluru Teachers Constituency.

వచ్చే లోక్‌సభ ఎన్నికలకు ఇప్పటి నుంచే బీజేపీ, జేడీఎస్‌లు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయేతో పొత్తు కుదిరిన తర్వాత మాజీ ముఖ్యమంత్రి బీఎస్‌ యడ్యూరప్ప నివాసంలో రాష్ట్ర బీజేపీ నేతలతో జేడీఎస్ నాయకుడు, మాజీ సీఎం హెచ్‌డీ కుమారస్వామి సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో లోక్‌సభ ఎన్నికల సన్నాహకాలు, బెంగళూరు ఉపాధ్యాయుల నియోజకవర్గం ఉప ఎన్నికపై చర్చ జరిగింది.

బెంగళూరు ఉపాధ్యాయ నియోజకవర్గాన్ని జేడీఎస్‌కు వదులుకోవాలని బీజేపీ నాయకులు నిర్ణయించారు. ఈ నిర్ణయానికి బీజేపీ హైకమాండ్ అంగీకరించింది. బీజేపీ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో జేడీఎస్ రాష్ట్ర న్యాయ విభాగం అధ్యక్షుడు ఎపీ రంగనాథ్ బెంగళూరు ఉపాధ్యాయ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో (ఎమ్మెల్సీ) ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా ఆయనను రంగంలోకి దించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో శాసనమండలి సభ్యుడిగా ఉన్న పుట్టన్న బీజేపీని వీడి కాంగ్రెస్‌ లో చేరిపోవడంతో ఖాళీ అయిన స్థానానికి ఉప ఎన్నికను ప్రకటించారు.

JDS leader Ranganath nominated as NDA candidate for Bengaluru Teachers Constituency.

బెంగళూరు ఉపాధ్యాయ నియోజకవర్గంలో గతసారి బీజేపీ విజయం సాధించింది. అయితే ప్రస్తుతం ఉప ఎన్నికలు జరుగుతున్నందున బీజేపీ కూడా ఈ నియోజకవర్గాన్ని జేడీఎస్‌కు వదులుకోవాలని నిర్ణయించడంతో జేడీఎస్ రాష్ట్ర న్యాయ విభాగం అధ్యక్షుడు ఎ.పి.రంగనాథ్ ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా బరిలోకి దిగారు. కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా ఈ నియోజక వర్గం మీద కన్ను వేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+