హైదరాబాద్ పార్టీకి షాక్ ఇచ్చిన దళపతులు, పొత్తు ?, లోకల్ లో సింహం సింగిల్ గా పోటీ !
బెంగళూరు/హైదరాబాద్: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే నాయకులు నామినేషన్లు వేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్లు వెయ్యడానికి నామినేషన్లు వెయ్యడానికి గురువారంతో గడువు ముగిసింది. ఇంతకాలం అసాదుద్దీన్ ఓవైసీతో పొత్తు పెట్టుకోవాలని ఆలోచించిన జేడీఎస్ పార్టీ మా సింహాలు సింగిల్ గా పోటీ చేస్తాయని స్పష్టం చేసింది.
ఏఐఎంఐఎంతో పొత్తు పెట్టుకోవడం లేదని జేడీఎస్ పార్టీ అధికారికంగా తేల్చి చెప్పింది. కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నకల్లో జేడీఎస్ పార్టీతో పొత్తు పెట్టుకుని కొన్ని నియోజక వర్గాల్లో లాభం పొందాలని అసాదుద్దీన్ ఓవైసీ అనేక ప్రయత్నాలు చేశారు. కొందరు జేడీఎస్ నాయకులు కూడా ఎంఐెంతో పొత్తు ఉంటుందని, చర్చలు జరుగుతున్నాయని ఇంతకాలం చెబుతూ వచ్చారు.

గురువారం రోజు కూడా జేడీఎస్ పార్టీ నాయకులు నామినేషన్లు వేశారు. అయితే తాము ఎంఐఎంతో పొత్తు పెట్టుకుంటున్నామని జేడీఎస్ దళపతులు హెచ్.డీ. దేవేగౌడ, హెచ్.డీ. కుమారస్వామితో పాటు హెచ్ డీ. రేవణ్ణ కూడా ఎక్కడా అధికారికంగా మీడియా ముందు కాని, బహిరంగ సభలు, సమావేశాల్లో చెప్పలేదు.
ఇప్పటికే కొన్ని నియోజక వర్గాల్లో నామినేషన్లు వేసిన అసాదుద్దీన్ ఓవైసికి చెందిన ఎంఐఎం పార్టీ నాయకులు జేడీఎస్ తో పొత్తు లేకుండానే బరిలోకి దిగుతున్నారు. తాము కర్ణాటకలోని గుల్బర్గా రూరల్, నంజనగూడు, బాగేపల్లి, బెంగళూరులోని కేఆర్ పురం, సీవీ రామనగర్, విజయనగర, మహదేవపుర నియోజక వర్గాల్లో సీపీఐ (ఎం), ఆర్ పీఐ పార్టీలకు బయటి నుంచి మద్దతు ఇస్తామని జేడీఎస్ పార్టీ అధికారికంగా ప్రకటించింది.
జేడీఎస్ పార్టీ బయటి నుంచి మద్దతు ఇస్తున్న పార్టీలో ఎంఐఎం పార్టీ లేకపోవడంతో ఆ పార్టీకి చెందిన మైనార్టీ నాయకులు షాక్ అయ్యారు. మొత్తం మీద కర్ణాటకలో అతి పెద్ద మూడో పార్టీగా గుర్తింపు తెచ్చుకున్న జేడీఎస్ పార్టీతో స్నేహం చెయ్యాలని అనుకున్న ఎంఐఎం పార్టీ నాయకులతో పాటు ఆ పార్టీ చీఫ్ అసాదుద్దీన్ ఓ వైసీకి దళపతులు ఊహించని షాక్ ఇచ్చారు.
కర్ణాటకలో హంగ్ వస్తే జేడీఎస్ పార్టీ కాంగ్రెస్ తో నైనా, బీజేపీతో నైనా కలిసి పనిచేసే అవకాశాలు ఉండటంతో ఎంఐెఎంతో దూరంగా ఉండాలని జేడీఎస్ నాయులు అనుకున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అయితే అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తరువాత ఏమైనా జరిగే అవకాశం ఉందని తెలిసింది.












Click it and Unblock the Notifications