వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజీనామా చేసిన రెబల్ ఎమ్మెల్యేలు ఎవరో తెలీదు: మాజీ ప్రధాని, వేచిచూడాలి, ప్రభుత్వం !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: సంకీర్ణ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేలు ఎవరెవరు రాజీనామా చేశారు ? అనే విషయం తనకు తెలీదనని జేడీఎస్ పార్టీ చీఫ్, మాజీ ప్రధాని హెచ్.డి. దేవేగౌడ అన్నారు. ఎవరు రాజీనామా చేశారు అంటూ తాను ఎవరినీ అడగలేదని మాజీ ప్రధాని హెచ్.డి. దేవేగౌడ చెప్పారు.

శనివారం బెంగళూరులో మీడియాతో మాట్లాడిన మాజీ ప్రధాని హెచ్.డి. దేవేగౌడ కర్ణాటక స్పీకర్ రమేష్ కుమార్ కార్యాలయంలో 11 మంది ఎమ్మెల్యేలు రాజీనామా లేఖలు ఇచ్చారని తనకు సమాచారం వచ్చిందని అన్నారు. అయితే ఆ 11 మంది ఎమ్మెల్యేలు ఎవరు అనే వియం మాత్రం తనకు తెలీదని మాజీ ప్రధాని దేవేగౌడ అన్నారు.

JDS supremo HD Deve Gowda reacts about mlas resignation

స్పీకర్ కోర్టులో బాల్ ఉందని, ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలని మాజీ ప్రధాని దేవేగౌడ చెప్పారు. ఎమ్మెల్యేల రాజీనామాల విషయం ఏ మాత్రం తనకు తెలీదని మాజీ దేవేగౌడ అన్నారు. బెంగళూరులోని 28 శాసన సభ నియోజక వర్గాల విషయం, కార్పొరేషన్ ఎన్నికల విషయాలు చర్చించడానికి తాను జేడీఎస్ కార్యాలయానికి వచ్చానని మాజీ ప్రధాని దేవేగౌడ వివరించారు.

ప్రస్తుత రాజకీయాలు ఎటువైపు దారి తీస్తాయో మీతో పాటు తాను వేచి చూస్తానని మాజీ ప్రధాని దేవేగౌడ మీడియాతో అన్నారు. సీఎం కుమారస్వామి లేని సమయంలో ఎమ్మెల్యేలు ఎందుకు రాజీనామా చేశారు, వారు ఎలాంటి అడుగులు వేస్తారో తనకు తెలీదని మాజీ ప్రధాని దేవేగౌడ చెప్పారు.

English summary
JDS supremo HD Deve Gowda reacts about mlas resignation that he don't know anything about this and speaker look into it.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X