తాను ప్రేమించినఅమ్మాయితో చనువు: ఫ్రెండ్‌ని చంపాడు
కటక్: కటక్‌లో ఘోరం జరిగింది. తాను ప్రేమించిన యువతికి చేరువవుతున్న స్నేహితుడిని ఓ విద్యార్థి దారుణంగా హతమార్చాడు. కటక్‌లోని స్టూవర్ట్ సైన్స్ కళాశాలలో స్నేహితులైన అభినాష్ మహంతి, అమూల్య సాహులు అదే కళాశాల విద్యార్థినిని ప్రేమించారు.
ఆమె అభినాష్‌కు చేరువవుతోంది. దీనిని గమనించిన అమూల్య సాహులు సహించలేకపోయాడు. స్నేహితుడిని మహానది వద్దకు తీసుకు వెళ్లి, అందులోకి తోసి హతమార్చాడు. అంతకుముందు వేరే సెల్‌ఫోన్ నుండి.. నువ్వు ప్రేమిస్తున్న యువతి నాది, అడ్డు తప్పుకో అంటూ మెసేజ్ చేసి బెదిరించాడు.

ఈ సందేశాల పైన అభినాష్ ఆవేదన చెందేవాడు. అనంతరం.. నీకు మెసేజ్‌లు చేస్తున్నవాడిని గుర్తించానని, ఆదివారం మహానది తీరానికి వస్తే చెబుతానని అమూల్య సాహు అతనిని మహానది ఒడ్డుకు పిలిపించాడు. అతను వచ్చాక అతనిని నదిలోకి తోసి నీటిలో ముంచి చంపేశాడు.
ఈ విషయాన్ని డీసీపీ సంజీప్ అరోరా బుధవారం విలేకరుల సమావేశంలో తెలిపారు. అభినాష్ మృతదేహం లభించింది. అభినాష్ మృతదేహం కనిపించడంతో తన కుమారుడిని ఎవరో హత్య చేశారని తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. దర్యాఫ్తులో భాగంగా అమూల్యను అదుపులోకి తీసుకొని విచారించారు. దీంతో విషయం బయటపడింది.
రోడ్డుపై నడిచివెళ్తున్న యువతిని వేధిస్తున్న వారిని వారించబోయి దెబ్బలు తిని ఆసుపత్రి పాలయ్యాడు ఓ యువకుడు. బుధవారం రాత్రి మణిపూర్‌కు చెందిన 21 సంవత్సరాల విద్యార్థి రోడ్డుపై నడిచి వెళ్తున్నాడు. ఆ సమయంలో ఓ మహిళను వేధిస్తున్న ముగ్గురు తాగుబోతులను అతను వారించాడు. దీంతో కోపోద్రిక్తులైన ఆ ముగ్గురూ మణిపూర్ యువకుడిని చావబాదారు. తలకు తీవ్ర గాయాలైన ఆ యువకుడిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications