జేఈఈ మెయిన్ 2023 సెషన్ 1 ఫలితాలు వచ్చే వారంలోనే?: ఇలా తెలుసుకోండి
ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన జేఈఈ మెయిన్ 2023 తొలి విడత పరీక్ష ఫలితాలు త్వరలోనే వెలువడనున్నాయి.
న్యూఢిల్లీ: ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన జేఈఈ మెయిన్ 2023 తొలి విడత పరీక్ష ఫలితాలు త్వరలోనే వెలువడనున్నాయి. ఇప్పటికే ప్రాథమిక కీ విడుదల చేసి అభ్యంతరాలను స్వీకరించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ).. తుది కీ, ఫలితాలను ప్రకటించేందుకు కసరత్తులు ముమ్మరం చేసింది. అంతేగాక, వచ్చే వారంలోనే జేఈఈ మెయిన్ తొలి విడత ఫలితాలను వెల్లడించే అవకాశం ఉన్నట్లు తెలిసింది.
జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు వివిధ తేదీల్లో జరిగిన జేఈఈ మెయిన్-2023 తొలి విడత పరీక్షల కోసం దేశ వ్యాప్తంగా దాదాపు 9 లక్షల మందికిపైగా విద్యార్థులు రిజిస్టర్ చేయించుకున్నారు. పేపర్ 1 (బీఈ/బీటెక్ కోర్సులు) పరీక్ష రాసేందుకు 8.22 లక్షల మంది విద్యార్థులు హాజరు కాగా, వీరిలో 2.6 లక్షల మంది అమ్మాయిలు, 6 లక్షల మందికిపైగా అబ్బాయిలు ఉన్నారు.

జేఈఈ మెయిన్ ఫలితాలు తెలుసుకోండిలా
ఎన్టీఏ జేఈఈ మెయిన్ అధికారిక వెబ్‌సైట్ https://jeemain.nta.nic.in/ను సందర్శించండి.
హోంపేజీలో జేఈఈ మెయిన్ సెషన్ 1(2023) ఫలితాలు అనే లింక్‌పై క్లిక్ చేయండి.
అప్లికేషన్ నెంబర్, పాస్‌వర్డ్/పుట్టిన తేదీ వంటి వివరాలను ఎంటర్ చేయగానే.. స్క్రీన్ పై మీ ఫలితం కనిపిస్తుంది.
ఆ తర్వాత దాన్ని డౌన్‌లోడ్ చేసి, ప్రింట్ తీసుకోవాలి.
భవిష్యత్ అవసరాల కోసం దాన్ని భద్రపర్చుకోవాలి.
ఇక పేపర్ 2(బీ.ఆర్క్/ బీ.ప్లానింగ్) పరీక్షను 46 వేల మందికిపైగా విద్యార్థులు రాయగా, వీరిలో 25వేల మంది అబ్బాయిలు, 21వేల మందికిపైగా అమ్మాయిలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. కాగా, జేఈఈ మెయిన్ రెండో విడత పరీక్షలు ఏప్రిల్ 6 నుంచి 12 వరకు జరగనున్నాయి.












Click it and Unblock the Notifications