వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

JEE Main: ఫలితాలు వెల్లడి: డైరెక్ట్ లింక్ ఇదే

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తోన్న జేఈఈ మెయిన్ సెషన్ 1 (JEE Main session 1) ఫలితాలు వెల్లడయ్యాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) వీటిని విడుదల చేసింది. ఈ ఫలితాలను ఎన్టీఏ వెబ్‌సైట్ డైరెక్ట్ లింక్‌లో పొందుపరిచింది. జేఈఈ మెయిన్, ఎన్టీఏ రిజల్ట్స్ అనే వెబ్‌సైట్లలో పరీక్షల ఫలితాలు అందుబాటులో ఉన్నాయి. జేఈఈ టాపర్స్ లిస్ట్‌ను కొద్దిసేపటి తరువాత ప్రకటిస్తామని ఎన్టీఏ పేర్కొంది. ఈ లింక్ jeemain.nta.nic.in, ntaresults.nic.in.

ఫిజిక్స్, కెమిస్ట్రీ, మేథమేటిక్స్‌తో పాటు అగ్రిగేట్ పర్సెంటైల్ మార్కుల స్కోరింగ్‌కు సంబంధించిన పూర్తి వివరాలను ఎన్టీఏ ఈ వెబ్‌‌సైట్స్‌లల్లో అందుబాటులోకి తీసుకొచ్చింది. జేఈఈ మెయిన్స్ పరీక్షలు రాసిన అభ్యర్థులు.. ఈ లింక్స్‌ను క్లిక్ చేయడం ద్వారా వాటిని తెలుసుకోవచ్చు. ఇందులో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), గవర్నమెంట్ ఫిల్మ్స్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్స్‌లల్లో ప్రవేశాలు పొందుతారు.

Joint Entrance Examination Main (JEE Main) Session 1 result has been declared.

జేఈఈ మెయిన్స్‌లో సాధించిన మార్కుల ఆధారంగా ప్రవేశ అర్హత లభిస్తుంది. 2022లో రెండున్నర లక్షల మందికి పైగా అభ్యర్థులు జేఈఈ మెయిన్స్ రాశారు. జేఈఈ అడ్వాన్స్డ్‌ కోసం అర్హత సాధించారు. అభ్యర్థులు తొలుత వెబ్‌సైట్స్ లింక్స్‌ను క్లిక్ చేయాలి. లాగిన్ కావడం కోసం తమ అప్లికేషన్ నంబర్‌ను పొందుపరచాలి. పాస్‌వర్డ్‌ లేదా పుట్టిన రోజును వినియోగించాలి. ఆ వెంటనే స్క్రీన్‌పై స్కోర్ కార్డ్ డిస్‌ప్లే అవుతుంది. దీన్ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు లేదా ప్రింట్ చేసుకోవచ్చు.

English summary
Joint Entrance Examination Main (JEE Main) Session 1 result has been declared.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X