చోరీ నగలు కొనుగోలు చేస్తున్న ప్రముఖ జ్యువెలరీ షోరూమ్ ఓనర్, కట్ చేస్తే ?
ప్రముఖ బంగారు వ్యాపారి, అత్తిక గోల్డ్ కంపెనీ యజమాని అత్తిక బాబు అలియాస్ బొమ్మనహళ్లి బాబును కర్ణాటకలోని తుమకూరు జిల్లా తురువేకెరె వద్ద పోలీసులు అరెస్టు చేశారు.దొంగిలించిన బంగారు ఆభరణాలు కొనుగోలు చేసిన ఆరోపణలపై బెంగళూరులోని ఫ్రేజర్ టౌన్ నివాసం సమీపంలో అత్తిక బాబును కర్ణాటక పోలీసులు అరెస్టు చేశారు.
చోరీకి గురైన బంగారు ఆభరణాల కొనుగోలుపై తురువేకెరె పోలీస్‌స్టేషన్ పరిధిలో కేసు నమోదైంది. తురువేకెరెను సీఐ, ఆయన బృందం బెంగళూరు చేరుకుని అత్తిక బాబును అరెస్టు చేశారు. ఉదయ్ అలియాస్ అశోక్ అనే వ్యక్తి పగటి పూట పలు ప్రాంతాల్లో సంచరిస్తూ వివిద ప్రాంతాల్లో బంగారు నగలు చోరీ చేసేశాడు. అలాగే రాత్రిపూట కూడా ఉదయ్ పలు ప్రాంతాల్లో చోరీలు చేస్తున్నాడని పోలీసు అధికారులు అంటున్నారు.

ఉదయ్ అలియాస్ తన భార్య శారద ద్వారా బంగారు నగల షోరూమ్ యజమాని అత్తిక బాబుకు బంగారం విక్రయించేవాడు. తురువేకెరెలో కొంతకాలం క్రితం ఉదయ్ బంగారు నగలు చోరీ చేశాడు. తురువేకెరెలో చోరీ చేసిన బంగారు నగలను ఉదయ్ అతని భార్య శారదకు ఇచ్చాడు. తురువేకెరెలో చోరీ చేసిన బంగారు నగలను అత్తిక బాబు కొనుగోలు చేశాడని పోలీసు అధికారులు అంటున్నారు.
చోరీ అయిన బంగారు నగల కోసం తురువేకెరె పోలీసులు గాలించారు. అప్పటికే కేసు నమోదు చేసిన పోలీసులు ఉదయ్ ని అదుపులోకి తీసుకుని విచారణ చేశారు.ఉదయ్ సినిమా స్టోరీ మొత్తం పోలీసులకు చెప్పాడు. పోలీసులు బెంగళూరు చేరుకుని బంగారు నగల వ్యాపారి అత్తిక బాబును అరెస్టు చేశారు.
ఈ బంగారు నగలను ఉదయ్ అతని భార్య శారద ద్వారా జిగణిలోని అత్తిక గోల్డ్ కంపెనీలో విక్రయించాడు.

అనంతరం కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చోరీకి గురైన బంగారు ఆభరణాలను కొనుగోలు చేసినట్లు వెలుగులోకి రావడంతో పోలీసు బృందం బెంగళూరు వెళ్లి అత్తిక బాబును అదుపులోకి తీసుకున్నారు. అత్తిక బాబును పోలీసులు మరింతగా విచారిస్తున్నట్లు సమాచారం. అత్తిక బాబు ఇంకా ఎంత మంది దగ్గర చోరీ చేసిన బంగారు నగలు కొనుగోలు చేశాడు అని ఆరా తీస్తున్నామని, కేసు విచారణ చేస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications