షాక్: తెగిన కాలుని దిండుగా పెట్టి క్షతగాత్రుడికి ఆపరేషన్

Posted By:
Subscribe to Oneindia Telugu

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో దిగ్బ్రాంతికరమైన సంఘటన చోటు చేసుకుంది. అంతేకాకుండా రాష్ట్రంలోని ఆస్పత్రుల తీరును ఇది బయటపెడుతోంది. ఓ వ్యక్తి బస్సు ప్రమాదంలో తీవ్రరంగా గాయపడ్డాడు. అతని తెగిన కాలును దిండుగా పెట్టి అతనికి వైద్యులు శస్త్రచికిత్స చేశారు.

ఈ సంఘటన ఝాన్సీ ప్రభుత్వం వైద్య కళాశాలలో చోటు చేసుకుంది. క్షతగాత్రుడికి సాయం చేసే ఉద్దేశంతో క్షతగాత్రుడి తెగిన కాలును మహారాణి లక్ష్మి బాయ్ వైద్య కళాశాల వైద్యులు అతనికి దిండుగా పెట్టారు. అతనితో పాటు ఉన్నవారిని అది తీవ్రంగా భయపెట్టింది.

UP map

బాధితుడికి సంబంధించిన దృశ్యాలను ఓ స్థానిక టీవీ చానెల్ ప్రసారం చేసింది. దీంతో ఆ విషయం వెలుగులోకి వచ్చింది. ఆస్పత్రిలోని క్యాజువాలిటీ వార్డులో స్ట్రెచర్‌పై క్షతగాత్రుడికి తెగిన కాలును దిండుగా పెట్టిన దృశ్యాలను ఆ చానెల్ ప్రసారం చేసింది.

క్షతగాత్రుడు పాఠశాల బస్సు క్లీనర్. శనివారంనాడు పిల్లలను ప్రైవేట్ పాఠశాలకు తీసుకుని వెళ్తున్న బస్సు ఝాన్సీ జిల్లాలోని మౌరానిపూర్ ఏరియాలో ట్రాక్టర్‌ను తప్పించబోయి ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో క్లీనర్ తీవ్రంగా గాయపడ్డాడు

అతన్ని వెంటనే ఝాన్సీలోని వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించారు. అయితే, తెగిన కాలుని అతనికి దిండుగా పెట్టారనే వార్తలను ఆస్పత్రి వర్గాలు ఖండిస్తున్నాయి. అయితే, సంఘటనపై విచారణకు ఆదేశిస్తున్నట్లు తెలిపాయి.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The doctors at a government medical college in Jhansi allegedly used the amputated leg of a man, who was seriously injured in a bus mishap, as a pillow.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి