బిజెపి చీఫ్ కొడుక్కి 11ఏళ్ల బాలికతో పెళ్లి: వాడుకొని వదిలేశాడని మరో యువతి

రాంచీ: జార్ఖండ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు తాలా మరాండి కుమారుడి వివాహం వివాదాస్పదమైంది. తాలా మరండి కుమారుడు మున్నా మరాండి ఓ మైనర్ బాలిక(11 ఏళ్లు)ను వివాహం చేసుకున్నాడు. అయితే, తనతో సన్నిహితంగా ఉండి శరీరకంగా ఉపయోగించుకుని.. ఇప్పుడు మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడంటూ మరో యువతి ఫిర్యాదు చేసింది. దీంతో మున్నా మరాండిపై కేసునమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

వివరాల్లోకి వెళితే.. మున్నా మరాండి వివాహం మైనర్ బాలికతో గత మంగళవారం జరిగింది. అయితే మున్నా వివాహం చేసుకున్న అమ్మాయి వయసు 11ఏళ్లే కావడంతో మున్నా తండ్రి తాలా మరాండికి రాష్ట్ర మహిళా కమిషన్‌ నోటీసులు పంపించినట్లు సమాచారం.

khand new

ఇది ఇలా ఉండగా, తనను మోసం చేసి.. ఇప్పుడు మరో అమ్మాయిని వివాహం చేసుకున్నాడని మున్నాపై ఓ యువతి మహిళా కమిషన్‌ను ఆశ్రయించింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనతో రెండేళ్లపాటు శారీరక సంబంధం కొనసాగించాడని.. ఇప్పుడు తనకు తెలియకుండా వేరే పెళ్లి చేసుకున్నాడని ఆరోపించింది.

ఈ రెండు ఘటనలతో మున్నా వివాహం ఇప్పుడు జార్ఖండ్‌లో వివాదాస్పదంగా మారింది. ఈ విషయంపై విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. ఆరోపణలపై విచారణ జరిపి, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడిని పదవి నుంచి తొలగించాలని కాంగ్రెస్ పార్టీ నేత అలోక్ దూబే డిమాండ్‌ చేశారు. అయితే దీనిపై బిజెపి ఇంతవరకు స్పందించలేదు. అయితే, మున్నా వివాహ విందు జరిగిన రోజు జార్ఖండ్‌ ముఖ్యమంత్రి రఘుబర్‌దాస్‌ జిల్లాలో ఉన్నప్పటికీ.. వేడుకకు హాజరుకాకపోవడం గమనార్హం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+