కడుపు నొప్పికి ప్రిస్కిప్షన్.. కండోమ్స్ రాసిచ్చిన డాక్టర్..!

రాంచీ : గాడిద పుండుకు బూడిద మందు రాసిన చందంగా ప్రవర్తించాడు ఓ డాక్టర్. రోగమొక్కటైతే మందొక్కటి రాసిచ్చాడు. అది వేరే మందు ఐతే పర్వాలేదు. కానీ సదరు వైద్యుడు రాసిచ్చిన మందుల చీటి చూస్తే దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ కావాల్సిందే. ఆ చీటి తీసుకెళ్లి మెడికల్ షాపుకు వెళితే అక్కడున్నవారు వింతలా చూశారట. అంతలా ఆ చీటిలో ఏముందన్నది పాయింట్. కడుపునొప్పితో వెళ్లిన బాధితురాలికి కండోమ్ ప్రిస్కిప్షన్ రాసి ఇచ్చాడట ఆ డాక్టర్. దాంతో ఆ మహిళ కోపం నశాలానికి అంటింది.

జార్ఖండ్‌లోని సింగ్బుం జిల్లాలో వెలుగుచూసిన ఈ ఘటన ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఈనెల 23వ తేదీన ఓ మహిళా ప్రభుత్వ ఉద్యోగి కడుపునొప్పితో ప్రభుత్వాసుపత్రికి వెళ్లారు. అక్కడి కాంట్రాక్ట్ బేస్డ్ డాక్టర్ అష్రఫ్ ఆమెకు పరీక్షలు నిర్వహించిన అనంతరం ఈ మందులు వాడాలంటూ ప్రిస్కిప్షన్ రాసిచ్చాడు. అది తీసుకుని మెడికల్ షాపుకు వెళ్లిన సదరు మహిళకు చేదు అనుభవం ఎదురైంది. మెడికల్ షాపు వాళ్లు ఆమె చేతిలో కండోమ్స్ ప్యాకెట్ పెట్టారట. దాంతో ఆమె ఇదేంటని ప్రశ్నిస్తే.. అందులో అదే రాసి ఉందని జవాబిచ్చారట.

 jharkhand doctor prescription as condoms for stomach pain

డాక్టర్ తీరుపై అనుమానం వచ్చిన బాధితురాలు జార్ఖండ్ ముక్తి మోర్చా ఎమ్మెల్యే కునాల్ సారంగికి జరిగిన విషయం చెప్పారు. దాంతో ఆయన సదరు డాక్టర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అయితే ఎమ్మెల్యే ఫిర్యాదుతో డిపార్టుమెంటల్ విచారణ ప్రారంభమైంది. మెడికల్ సిబ్బందితో పాటు మానసిక వైద్యుడితో కూడిన కమిటీ విచారణ చేస్తున్నట్లు ఆ హాస్పిటల్ ఇంఛార్జ్ వెల్లడించారు. అయితే ఇంత పెద్ద రాద్దాంతం జరుగుతున్నా.. సదరు వైద్యుడు అష్రఫ్ మాత్రం స్పందించకపోవడం గమనార్హం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+